spot_img
Sunday, July 20, 2025
spot_img

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం..

తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్ కలకలం రేపుతోంది. చెడ్డీ గ్యాంగ్ కదలికలు తిరుపతి వాసులను కలవరపెడుతున్నాయి. చెడ్డీ గ్యాంగ్ వారం వ్యవధిలో నగరంలో మూడు చోట్ల దొంగతనాలకు విఫల యత్నం చేసింది.సీసీ ఫుటేజీలో చెడ్డీ గ్యాంగ్ కదలికలను పోలీసులు గుర్తించారు. ఈ మూడింటా తిరుపతిలో మకాం వేసిన ఓ గ్యాంగ్ పనిగా పోలీసులు అనుమానిస్తున్నారు. నగరవాసులను అప్రమత్తం చేశారు. అలాంటి ఈ గ్యాంగ్‌ ఇప్పుడు తిరుపతిలో మకాం వేసినట్టు పోలీసుల అనుమానం.

తిరుపతిలో జరిగిన మూడు చోరి ప్రయత్నాలలో చెడ్డీ గ్యాంగ్ కదలికలు కనిపించాయి. తిరుపతి సీసీ ఫుటేజీలో కనిపించిన దృశ్యాలు ఇప్పుడు వైరల్‌గా మారాయి. చెడ్డీ గ్యాంగ్ పేరు వింటేనే వెన్నులో వణుకు పుడుతుంది. కరుడుగట్టిన నేరాలకు ఈ ముఠా పెట్టింది పేరు. చెడ్డీ గ్యాంగ్‌ ఉత్తర భారత దేశానికి చెందిన ముఠా. బీహార్, ఉత్తర ప్రదేశ్, రాజస్థాన్, ఢిల్లీ రాష్ట్రాలకు చెందిన వారే ఈ తరహాలో చోరీలకు పాల్పడుతుంటారువీరు సంచార జీవులు. ఊరి శివార్లలో తాత్కాలిక నివాసం ఏర్పాటు చేసుకుంటారు. ఏ ఊరిలోనూ ఎక్కువ రోజులు ఉండరు. దోపిడీ చేసిన తర్వాత వెంటనే సొంతూళ్లకు వెళ్లిపోతారు. తమ ప్రయత్నాలు వరుసగా విఫలమైనా పది, పదిహేను రోజులకు మించి ఏ ఊరిలో ఉండరు. దోపిడీకి పాల్పడే ముందు చెడ్డీ గ్యాంగ్ చాలా కసరత్తు చేస్తుంది. టార్గెట్‌ చేసిన ఇంటిపై రెక్కీ నిర్వహిస్తుంది.

ఆడవాళ్లు రెక్కికీ సాహాయ పడతారు. అర్ధరాత్రి దాటిన తర్వాతే ఈ ముఠా బయలు దేరుతుంది. షర్ట్‌ లేకుండా చెడ్డీ వేసుకుంటారు. ఎవరన్నా పట్టుకున్నా జారి పోవడానికి వీలుగా ఒళ్లంతా కందెన అనే ద్రావకాన్ని పూసుకుంటారు. నడుముకు తువాళ్లు చుట్టుకుంటారు. అందులో రాళ్లు దాచుకుంటారు. ఎవరైనా వారిని పట్టుకోవాలని చూస్తే రాళ్లతో దాడి చేస్తారు.దోపిడీ చేసేంత వరకు రకరకాల ప్రయత్నాలు చేయడం ఈ గ్యాంగ్‌ అలవాటు. భయంకరమైన ప్రమాదంలో ఉన్నట్లు అరుస్తారు, కేకలు వేస్తారు. తలుపులు తీసి ఆదుకోమని వేడుకుంటూ ఏడుస్తారు. తలుపులు తీసిన తర్వాత ఒక్కసారిగా ఇంట్లోకి చొరబడి దోపిడీ చేస్తారు. ఎవరైనా ఎదిరిస్తే దాడులకు దిగుతారు. తమ దోపిడీలకు అడ్డువస్తే మట్టు పెట్టడానికి కూడా వెనుకాడరు.

ఈ నేపథ్యంలో తిరుపతిలో చెడ్డీ గ్యాంగ్‌ కదలికలు కలకలం సృష్టిస్తున్నాయి. చెడ్డీ గ్యాంగ్ కదలికలతో పోలీసులు అప్రమత్తం అయ్యారు. ప్రజలు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. రాత్రి వేళల్లో అపరిచితులకు తలుపులు తీయవద్దని సూచించారు. ప్రత్యేక పోలీసు బృందాలు గాలింపు ప్రారంభించాయి. రాత్రిపూట గస్తీని మరింత పెంచినట్టు ఎస్పీ పరమేశ్వర రెడ్డి పేర్కొన్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular