spot_img
Monday, July 21, 2025
spot_img

తిరుమల లడ్డు ప్రసాదంలో ఎలాంటి కొవ్వు లేదు – India Today సంచలన అధ్యయనం

తిరుపతి లడ్డూ ప్రసాదం విషయమై India Today తన అధ్యయన ఫలితాలను బహిర్గతం చేసింది. దేశంలోని ప్రముఖ ఆలయాల్లో ప్రసాదాలపై పరిశీలన జరిపిన అనంతరం, తిరుమల లడ్డూ ప్రసాదంలో ఎలాంటి జంతువుల కొవ్వు లేదా వెజిటేబుల్ ఫ్యాట్ కలవలేదని స్పష్టం చేసింది.పరీక్షలు శ్రీరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెస్టింగ్ సంస్థ ద్వారా నిర్వహించబడగా, లడ్డూ ప్రసాదం పూర్తిగా సురక్షితమైందని, అందులో కేవలం మామూలు చక్కెర, పాలు, నెయ్యి వంటి ఇతర సాంప్రదాయ పదార్థాలే వాడుతున్నారని నిర్ధారించారు.

తిరుమల లడ్డు ప్రసాదంపై వివాదం ఆలయ భక్తులు మరియు ఆచార పరిరక్షకుల మధ్య ఆసక్తిగా మారిన అంశం. కొద్దీ రోజుల క్రితం తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందనే ఆరోపణలు రేకెత్తాయి, దీని వల్ల భక్తులలో అనేక సందేహాలు, ఆందోళనలు మొదలయ్యాయి. ఇది పెద్దఎత్తున ప్రచారం కావడంతో, తిరుమల తిరుపతి దేవస్థానం (TTD) లడ్డు ప్రసాదం శుద్ధమైన పద్ధతిలోనే తయారవుతుందని, ఎలాంటి జంతువుల కొవ్వు ఉపయోగించడం జరగదని స్పష్టమైన ప్రకటన చేసింది.

ఈ వివాదానికి ముగింపు పలుకుతూ, India Today సంస్థ తిరుమల లడ్డూ ప్రసాదంపై ప్రత్యేక అధ్యయనం నిర్వహించింది. ఇది దేశంలోని ప్రముఖ ఆలయాల ప్రసాదాలకు సంబంధించిన పరీక్షల్లో భాగంగా జరిగింది. ఈ పరీక్షలు శ్రీరాం ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెస్టింగ్ ద్వారా నిర్వహించబడగా, తిరుమల లడ్డు ప్రసాదంలో జంతువుల కొవ్వు లేదా వెజిటేబుల్ ఫ్యాట్ లేవని నిర్ధారించబడింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular