spot_img
Sunday, July 20, 2025
spot_img

దారుణం, మృతదేహాన్ని పోస్ట్‌మార్టం కోసం ఎలా ఈడ్చుకెళుతున్నారో చూడండి,

ఉత్తరప్రదేశ్‌లోని( Uttar Pradesh ) ఝాన్సీలో షాకింగ్ ఘటన వెలుగులోకి వచ్చింది. పోస్ట్‌మార్టం( Postmortem ) రూంలోకి ఒక మృతదేహాన్ని ఇద్దరు వ్యక్తులు ఈడ్చుకెళుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది.ఆ శవం కాళ్లకు గుడ్డ కట్టి ఈడ్చుకుంటూ వెళ్తున్న వీడియో వైరల్ కావడంతో నెటిజన్లు మీరు మనుషులేనా అంటూ మండిపడుతున్నారు.కేవలం 9 సెకన్ల ఈ వీడియో క్లిప్‌లో అంబులెన్స్ సిబ్బందిగా( Ambulance Staff ) భావిస్తున్న ఇద్దరు వ్యక్తులు, మృతదేహాన్ని దారుణంగా లాక్కెళుతుండటం స్పష్టంగా కనిపిస్తోంది. ఈ ఘటన ఎప్పుడు జరిగిందనేది ఇంకా తెలియాల్సి ఉంది వీడియో వైరల్ కావడంతో పోలీసులు స్పందించారు. ర్కిల్ ఆఫీసర్ రామ్‌వీర్ సింగ్ మాట్లాడుతూ, ఈ ఘటనపై విచారణ ప్రారంభించామని తెలిపారు.విచారణ పూర్తయిన తర్వాత బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చారు.ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి, బాధ్యులెవరైనా సరే వదిలిపెట్టకుండా శిక్షించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular