అనంతపురం జిల్లాలోని ధర్మవరం.. ఫ్యాక్షన్ జోన్ లోనే ఉన్నప్పటికీ కొన్నాళ్లుగా ఇక్కడ పరిస్థితులు సజావుగానే ఉన్నాయి. రాజకీయ వివాదాలు తప్ప వ్యక్తిగత కక్షలు హత్యలు లేవు.ప్రభుత్వాలు తీసుకుంటున్న చర్యలు, ప్రజల్లో వచ్చిన మార్పుల కారణంగా ధర్మవరంలో మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. అయితే అనూహ్యంగా శనివారం ధర్మవరం ఒక్కసారిగా దడ దడలాడింది. ప్రజలు ఉలిక్కిపడ్డారు. దీనికి కారణం ధర్మవరం యువకుడు ఒకరు పాకిస్థాన్ లోని ఉగ్రవాదులతో నేరుగా ఫోన్లో మాట్లాడడమే. ఇది నిజం. కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు రంగంలోకి దిగేవరకు స్థానికంగా ఆ యువకుడు చేస్తున్న వ్యవహారాన్ని పోలీసులు కూడా గుర్తించలేకపోయారు.
అధికారిక సమాచారం మేరకు..
ధర్మవరం ప్రాంతానికి చెందిన ఓ సామాజిక వర్గానికి చెందిన యువకుడికి వివాహం అయింది. అయితే అతని ప్రవర్తన నచ్చక భార్య వదిలేసింది. దీంతో వేరే మహిళతో సంబంధం పెట్టుకున్న ఇతను రహస్యంగా జీవిస్తున్నాడు. అయితే ఇప్పటికి ఉగ్రవాదులతో సంబంధాలు ఉన్నారని అరెస్టు చేసిన కొందరు ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈ యువకుడిపై నిఘా పెట్టారు. ఈజీ మనీ కోసం సదరు యువకుడు పాకిస్థాన్ ఉగ్రవాద సంస్థల ప్రభావానికి లోనైనట్టు పోలీసులు చెబుతున్నారు. పాక్ ఉగ్రవాద సంస్థలతో ఇతను నిరంతరం టచ్ లో ఉన్నారని, వాట్సాప్ చాటింగ్ చేస్తున్నారని కూడా వెల్లడించారు. సుమారు 30 ఉగ్రవాద సంస్థల్లో సభ్యుడిగా ఉన్నట్టు గుర్తించామని చెప్పారు.
సాహిత్యం, వీడియోలు..
నిందితుడు నివసిస్తున్న ఇంట్లో ఉగ్రవాదానికి సంబంధించిన శిక్షణ వీడియోలు, చాటింగ్ బాక్సులను పోలీసులు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. అదేవిధంగా ఉగ్రవాదం వైపు మళ్లించేలా పుస్తకాలు కూడా ఉన్నాయని చెప్పారు. సుమారు 25 కు పైగా సిమ్ కార్డులను స్వాధీనం చేసుకున్నారు. అయితే వీటిని ఎక్కడ కొనుగోలు చేశాడు, వాటికి ఇచ్చిన గుర్తింపు కార్డులు ఏంటి అనే వివరాలపై ఆరా తీస్తున్నట్టు పోలీసులు చెప్పారు. ఈ సిమ్ కార్డుల వినియోగంపైనా ప్రత్యేక దృష్టి పెట్టారు. వాట్సాప్ గ్రూపుల్లో సభ్యుడిగా ఉన్న నేపథ్యంపై ఆయా గ్రూపుల వివరాలను కూడా రాబడుతున్నారు. ఆపరేషన్ సిందూర్ తర్వాత ఈ యువకుడు పాక్ లోని ఉగ్ర శిబిరాల నాయకులతో ఎక్కువగా సంభాషించినట్టు గుర్తించారు.
ధర్మవరం అబ్బాయి పాకిస్తాన్ కు ఎందుకు ఫోన్ చేసి ఏంచేస్తున్నాడో తెలుసా
RELATED ARTICLES