గుజరాత్లో కొంతమంది దుండగులు ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించారు. పోలీసుల వివరాల ప్రకారం.. మోరిస్ సామ్యుల్ క్రిస్టియన్ అనే నిందితుడు తన ముఠాతో కలిసి 2019లో ఓ ప్రభుత్వ భూమి సెటిల్మెంట్లో నకిలీ తీర్పు ఇచ్చేందుకు నకిలీ కోర్టును ఏర్పాటు చేశాడు.సమాజంలో కేటుగాళ్లు అడుగడుగునా ఎక్కువైపోతున్నారు. వారి జేబులు నింపుకోవడం కోసం ఎదుటివారి జేబులకు చిల్లులు పెడుతున్నారు. కష్టపడకుండా వచ్చిన రూపాయి వారికి బాగా రుచించడంతో దేనికైనా తెగించడానికి వెనుకాడడం లేదు.శ్రమజీవి బ్రతకడానికి నానా అగచాట్లు పడుతున్న తరుణంలో ఇలాంటివారు అక్కడక్కడ తయారయ్యి, చట్టాలకే సవాల్ విసురుతున్నారు. అంతవరకు ఓకే గాని, ఇప్పుడు చెప్పుకోబోయే కథ వింటే మీరు అతడు ఏకంగా చట్టాన్ని చేతిలోకి తీసుకుని ఏకండ జడ్జ్ గా మారాడు ఓ కతర్నాక్ ఎంచేసాడో తెలుసుకుందామా
వివరాల్లోకి వెళితే, గుజరాత్ రాష్ట్రంలోని అహమ్మదాబాదులో ఒక వ్యక్తి వృత్తిరీత్యా, నకిలీ జడ్జ్ గా లాయరుగా అవతారం వ్యక్తి దొంగ బాబాలను మించిపోయేలా కోట్లకు పడగలెత్తిన వైనం స్థానికంగా సంచలనం రేపుతోంది. అహమ్మదాబాదులోని సివిల్ కోర్టు ముందే ఆ వ్యక్తి నెరిపిన ఈ వ్యవహారం సదరు కోర్టుకు కూడా తెలియకుండా ఇన్నాళ్ళు భలే మేనేజ్ చేశాడని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు.మోరిస్ శామ్యూల్ అనే వ్యక్తి నకిలీ ధ్రువపత్రాలు సృష్టించుకుని, తనకి తాను జడ్జ్ అని ప్రకటించుకుని ఏకంగా నకిలీ కోర్టునే సృష్టించాడు. ఆ తరువాత కొంతమంది ఏజెంట్లను నియమించుకొని మరి వారికి జీతాలు ఇచ్చి, సివిల్ కోర్టులోకి వెళ్లిన కొన్ని కేసులను చాలా చీప్ గా వాదించి పెడతామని ఇతని వైపుకు మళ్ళించేలా ప్లాన్ చేశాడు. ఈ క్రమంలో సదరు కేటుగాడు కోట్ల రూపాయలు విలువచేసే భూములకు సంబంధించిన కేసులను తీసుకోగా, వాటిలో కొన్ని ఉత్తర్వులు డిఎం కార్యాలయానికి చేరుకున్నాయి. దాంతో అతగాడు బండారం బయటపడడంతో పోలీసులు కేసు నమోదు చేసి శామ్యూల్ అనే వ్యక్తిని కటకటాల వెనక్కి నెట్టారు. దాంతో స్థానిక సివిల్ కోర్టు న్యాయవాది చౌతియా ఈ వ్యవహారంపై కఠిన చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించారు.