హైవేలపై వెళ్తున్నపుడు టోల్‌గేట్‌లు కనిపిస్తూనే ఉంటాయి. అయితే ఆ రోడ్లను కొన్ని ప్రైవేటు సంస్థలు వేసి.. ఆ తర్వాత టోల్‌గేట్లు ఏర్పాటు చేసి వాహనదారుల నుంచి డబ్బులు వసూలు చేస్తూ ఉంటాయి.
అందుకు ప్రభుత్వం అనుమతులు కూడా ఇస్తుంది. అయితే దీన్ని ఆసరాగా చేసుకుని ఓ ముఠా భారీ స్కెచ్ వేసింది. రోడ్డు మార్గం సరిగా లేని ప్రాంతంలో రోడ్డు వేసి.. ప్రభుత్వాలకు తెలియకుండా అక్కడ ఒక టోల్‌గేట్ ఏర్పాటు చేసుకుని మరీ డబ్బులు వసూలు చేస్తున్నారు. అయితే కొందరికి అనుమానం వచ్చి ఆరా తీయగా అసలు విషయం వెలుగులోకి వచ్చింది. అసలు దానికి ప్రభుత్వ అనుమతులు లేవని అక్రమంగా టోల్ గేట్ ఏర్పాటు చేసి డబ్బులు తీసుకుంటున్నారని గుర్తించారు. ఈ ఘటన సంచలనంగా మారింది.