అమరావతి మహిళలపై ఇటీవల వైస్సార్సీపీకి చెందిన ఛానెల్ లో డిబెట్ లో వేశ్యలు అనే పదం వాడటం పెద్ద దుమారంగా మారింది.
కొమ్మినేని శ్రీనివాస్ రావు డిబెట్ లో పాల్గొన్న.. జర్నలిస్ట్ కృష్ణంరాజు ఏపీ రాజధాని అమరావతి చుట్టుపక్కల ఎక్కువగా వేశ్యలు ఉంటున్నారని కాంట్రవర్సీగా మాట్లాడారు.
దీనిపై ఏపీ వ్యాప్తంగా దుమారం చెలరేగింది. ఈ వ్యాఖ్యలపై అమరావతి మహిళలతో పాటు, ఏపీ వ్యాప్తంగా మహిళలు నిరసనలకు దిగారు. ఈ క్రమంలో అమరావతి మహిళలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఏపీ మంగళగిరి పోలీసులు… కొమ్మినేని శ్రీనివాస్ రావు, జర్నలిస్ట్ కృష్ణంరాజులపై కేసుల్ని నమోదు చేశారు. కొమ్మినేనిని తొలుత ఏపీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్ట్ చేసి.. మంగళగిరి కోర్టులో హజరుపచ్చారు. కోర్టు.. రిమాండ్ ను విధించింది.
ఈ నేపథ్యంలో తాజాగా.. మంగళ గిరి కోర్టు ఆదేశాలపై.. కొమ్మినేని తరపు లాయర్ లు అత్యున్నత ధర్మాసనం సుప్రీంకోర్టులో బెయిల్ పిటిషన్ ను దాఖలు చేశారు. దీనిపై విచారించిన జస్టిస్ పికె మిశ్రా ధర్మాసనం.. కొమ్మినేనిని వెంటనే విడుదల చేయాలని బెయిల్ మంజురు చేస్తు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా.. మరోసారి అమరావతిపై అసభ్యకర వ్యాఖ్యలు చేయవద్దని కొమ్మినేనికి సుప్రీంకోర్టు సూచించింది.
కొమ్మినేని కేసు విచారణ నేపథ్యంలో ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. వాక్ స్వాతంత్ర్యాన్ని రక్షించాలన్న సుప్రీం కోర్టు…. నవ్వినంత మాత్రాన అరెస్టు చేస్తారా ..?.. అంటు పోలీసుల్ని ప్రశ్నించింది. అలాగైతే కేసుల విచారణ సందర్భంగా కొన్నిసార్లు తాము కూడా నవ్విన సందర్భాలు ఉంటాయన్నారు. మరోవైపున.. డిబేట్లను గౌరవప్రదంగా నిర్వహించాలని జస్టిస్ పీకే మిశ్రా, జస్టిస్ మన్మోహన్ లతో కూడిన ధర్మాసనం స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది.
మూడేళ్ల లోపు శిక్ష పడే నేరాలకు పోలీసులు ముందుగా 41 కింద నోటీసు ఇవ్వాలని సుప్రీంకోర్టు తీర్పులు చెబుతున్నాయి. కానీ ఏపీ పోలీసులు మాత్రం ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే అక్రమంగా అరెస్టు చేశారని ధర్మాసనం సీరియస్ అయ్యింది. అదే విధంగా కేఎస్సార్ లైవ్ షోలో గెస్ట్ చేసిన వ్యాఖ్యలకు యాంకర్ ఎలా బాధ్యత వహిస్తారని ధర్మాసనం తీవ్రస్థాయిలో మండిపడింది.
గెస్ట్ లు సడెన్ గా.. అలాంటి అభ్యంతరకర వ్యాఖ్యలు చేయోద్దని యాంకర్ కేఎస్ఆర్ నియంత్రించారు .. అదే విధంగా వాటిని సమర్థించలేదని స్పష్టంగా ఆ వీడియోలో కన్పిస్తుంది.
అదీ కాకుండా.. తెలంగాణలో అరెస్టు చేసి 331 కిలోమీటర్ల దూరంలో ఏపీలో రిమాండ్ చేశారు. ట్రాన్సిట్ రిమాండ్ కూడా తీసుకోలేదని ధర్మాసనం సీరియస్ అయ్యింది. అదే విధంగా .. కొమ్మినేని సీనియర్ జర్నలిస్టు ఆయనకు ఎలాంటి నేర చరిత్ర లేదు .
70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్. కొమ్మినేని దర్యాప్తును తప్పించుకునే ఎలాంటి ప్రయత్నం చేయలేదని ధర్మాసనం ఏపీ పోలీసుల తరపు లాయర్లపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే.. స్థానిక కోర్టులో కొమ్మినేని తరఫున న్యాయవాదిని అనుమతించలేదు. ఇది సహజ న్యాయ సూత్రాలకు ఇది విరుద్ధమని సుప్రీం తీవ్రస్థాయిలో ధ్వజమెత్తింది.
ఈ కేసు విచారణ నేపథ్యంలో పోలీసులు.. ప్రాథమిక హక్కు ఆర్టికల్ 19, 21 ,22(1)ను ఉల్లంఘించడంతో పాటు, ప్రజాస్వామ్య నాలుగో స్తంభమైన మీడియా గొంతు నొక్కే ప్రయత్నం చేస్తున్నారని సుప్రీంకోర్టు సీరియస్ అయ్యింది. వాక్ స్వాతంత్ర్యానికి భంగం కల్గించడంతో పాటు, అక్రమ అరెస్టుతో ఆయన జీవించే హక్కుకు భంగం కల్గిందని అత్యున్నత ధర్మాసనం ఏపీ పోలీసుల తీరును తూర్పారబట్టింది.భవిష్యత్తులో మరింత జాగ్రత్తగా ఉండాలని కొమ్మినేనిని హెచ్చరించిన సుప్రీం ధర్మాసనం.. క్రింది కోర్టు విధించిన షరతులకు లోబడే బెయిల్ మంజూరు చేస్తున్నామని స్పష్టం చేసింది. ఈ క్రమంలో కొమ్మినేనికి బెయిల్ రావడం ప్రస్తుతం ఆయనకు బిగ్ రిలీఫ్ గా చెప్పుకొవచ్చు.