spot_img
Thursday, February 5, 2026
spot_img

*నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం- మంటల్లో చిక్కుకుని ఏడుగురు కార్మికులు మృతి*

*నాంపల్లిలోని బజార్‌ఘాట్‌లో అగ్నిప్రమాదం- మంటల్లో చిక్కుకుని ఏడుగురు కార్మికులు మృతి*


హైదరాబాద్‌ మహానగరం మరోసారి ఉలిక్కిపాటుకు గురైంది. నాంపల్లి బజార్‌ఘాట్‌లోని ఓ భవనంలో మంటలు చెలరేగి.. ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. గ్రౌండ్ ఫ్లోర్‌లో ఉన్న కారు రిపేర్‌ గ్యారేజ్‌లో.. ఓ కారును రిపేర్ చేస్తుండగా ఒక్కసారిగా మంటలు చేలరేగాయి. దీంతో పక్కనే ఉన్న డీజిల్, కెమికల్ డ్రమ్ములకు మంటలు అంటుకున్నాయి. ఈ క్రమంలోనే గ్యారేజ్‌ నుంచి అపార్ట్‌మెంట్‌ పై అంతస్తులకు మంటలు వ్యాపించాయి.

అగ్నిప్రమాదం గురించి తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది, జీహెచ్ఎంసీ, ఎన్డీఆర్ఎఫ్‌ సిబ్బంది వెంటనే రంగంలోకి దిగారు. అగ్నిమాపక శకటాలను రంగంలోకి దించి, తొలుత మంటలను అదుపులోకి తెచ్చారు. అనంతరం, సహాయక సిబ్బంది భవనంలోకి వెళ్లి.. అతికష్టం మీద మంటల్లో చిక్కుకున్న వారిని కాపాడారు. అప్పటికే చనిపోయిన వారి మృతదేహాలతో పాటు.. 21 మందిని బయటికి తీసుకువచ్చి ఆసుపత్రికి తరలించామని పోలీసులు తెలిపారు. వారిలో 8 మంది అపస్మారక స్థితిలో ఉన్నారని చెప్పారు

మంటల్లో చిక్కుకుని ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారని.. మృతుల్లో 4 రోజుల పసికందు ఉన్నట్లు గుర్తించామని చెప్పారు. సహాయక చర్యలను అగ్నిమాపకశాఖ డీజీ నాగిరెడ్డి, మధ్యమండల డీసీపీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. అపార్ట్‌మెంట్ గ్రౌండ్ ఫ్లోర్‌లో కారు రిపేర్‌ గ్యారేజ్‌ ఉందని డీసీపీ తెలిపారు. గ్యారేజ్‌లో కారు రిపేర్ చేస్తుండగా మంటలు చెలరేగాయని చెప్పారు. అక్కడే డీజిల్, కెమికల్ డ్రమ్ములు ఉన్నాయని పేర్కొన్నారు. రసాయన డ్రమ్ముల వల్ల అపార్ట్‌మెంట్‌ పై అంతస్తులకు మంటలు వ్యాపించాయని ఆయన వివరించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular