ఐసీఐసీఐ బ్యాంక్ శాఖల్లో అక్రమాల వ్యవహారం కలకలం రేపుతోంది. చిలకలూరిపేట, నరసరావుపేట సహా విజయవాడ ఐసీఐసీఐ బ్యాంకు శాఖల్లో జరిగిన అక్రమాలపై సీఐడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే.ఈ క్రమంలో ఐసీఐసీఐ బ్యాంక్ మేనేజర్ నరేష్ సెల్ఫీ వీడియో కలకలం రేపింది. తాను మోసపోయానని.. బతకాలని లేదన్నారు. తాను మోసపోయానని..
బ్యాంకు ఆర్థిక లావాదేవీలు పెంచే క్రమంలో కొన్ని తప్పులు జరిగాయని, ఉన్నతాధికారులతో పాటుగా బ్యాంకు సిబ్బంది తననే తప్పు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ వీడియో రికార్డ్ చేశారు. బ్యాంక్ కస్టమర్లను మోసం చేసే ఉద్దేశం తనకు లేదని.. బంగారం రుణాలకు సంబంధించి కొందరి పేర్లు మాత్రమే మార్చామని.. ఎలాంటి మోసం చేయలేదని చెప్పుకొచ్చారు.కానీ కోబ్రా న్యూస్ దగ్గర ఉన్న సమాచారం మేరకు మొత్తం 100 కోట్ల స్కాం చేసినట్టు సమాచారం పూర్తి వివరాలు త్వరలో