నిజాంపేట్ బండారీ లేఅవుట్లో రెండేళ్ల చిన్నారిపై వీధికుక్క దాడి చేసింది. పార్క్ వద్ద ఆడుకుంటున్న సమయంలో సోమశ్రీ అనే రెండేళ్ల చిన్నారిపై వీధికుక్క ఒక్కసారిగా దాడి చేసి నోటితో పట్టుకుని లాక్కెళ్లింది.స్థానికులు గమనించి కుక్కను వెంబడించడంతో పాపను వదిలేసింది. ఈ ఘటనలో చిన్నారి మెడకు తీవ్ర గాయమైంది. బాలికను స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
నిజాంపేటలో దారుణం.. రెండేళ్ల చిన్నారిని నోటకరిచి లాక్కెళ్లిన వీధికుక్క
RELATED ARTICLES




