spot_img
Monday, March 23, 2026
spot_img

న్యూఇయర్ ఎఫెక్ట్.. బాంబులు పెట్టి పేల్చేస్తాం.. పోలీసులకు బెదిరింపు కాల్

ముంబై నగరంలో పలు ప్రాంతాల్లో పేలుళ్లకు పాల్పడుతామని పోలీసులకు ఓ బెదిరింపు కాల్ వచ్చింది. గుర్తు తెలియని వ్యక్తుల నుంచి కాల్ అందుకున్న పోలీసులు..

ముంబైలో హై అలర్ట్ విధించారు. జనవరి 1న కొత్త సంవత్సరం సందర్భంగా ప్రజలు పెద్ద సంఖ్యలో తమ ఇళ్ల నుండి బయటకు వచ్చే అవకాశం ఉన్న సమయంలో ఈ తరహా బెదిరింపులు రావడంపై అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలో పోలీసు స్టేషన్లు, క్రైమ్ విభాగాలను పోలీసులు అప్రమత్తం చేశారు. నగరంలోని పలు కీలక బహిరంగ ప్రదేశాలలో ఇప్పటికే సోదాలు నిర్వహించిన పోలీసులు.. ఎలాంటి అనుమానాస్పద పదార్థాలు, పేలుడు పదార్థాలు లభించలేదని చెప్పారు. కాల్ చేసిన ఆ అజ్ఞాత వాసి వివరాలు తెలుసుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ఈ విషయంపై తదుపరి విచారణ కొనసాగుతోంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular