ఈయన పేరు ఇబ్రహీం యూసిల్. ఉండేది టర్కీ. ఈ మొహాన్ని ఇలా బంధించుకోవడానికి ప్రత్యేక కారణం ఉంది. 2013 నుంచి ఈయన తన ముఖాన్ని ఇలాగే బంధించుకుంటున్నాడు.. ఉదయం లేవగానే కేజ్ తగిలించుకుని తాళం వేసి, కీస్ భార్యకు గానీ, కూతురికి గాని ఇచ్చి పనికి వెళ్లిపోతాడట. లంచ్ టైమ్లో పడుకునే టైమ్‌లో మాత్రమే ఆయన భార్య తాళాలు తీస్తుందట. మంచినీళ్లు తాగాలంటే ఇలా స్ట్రాతోనే తాగుతాడట.
ఇంతకీ ఇలా తనకు తాను బంధించుకోవడానికి కారణం సిగరెట్. వ్యసనంలా అంటుకున్న సిగరెట్ తాగడం మానుకోవడానికి ఆయన వేసుకున్న శిక్ష ఇది. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా సిగరెట్ తాగడం మానలేకపోవడంతో, సిగరెట్ తాగే వీలు లేకుండా ఇలా పంజరాన్ని ముఖానికి మెషిన్ మాస్క్ పెట్టేసుకున్నాడు. చుట్టు పక్కల జనం నవ్వుతున్నా, తన ఆశయం గొప్పది కాబట్టి అవన్నీ డోంట్ కేర్ అంటున్నాడు..
పదేళ్లకు పైగా పెట్టుకుంటున్నా, అది తీసేస్తే ఎక్కడ సిగరెట్ తాగుతానో అన్న భయం మాత్రం ఇబ్రహీంను వెంటాడుతున్నట్లుంది. అందుకే దాన్ని కంటిన్యూ చేస్తున్నాడు…
(కర్టసీ: సోషల్ మీడియా)