పండగల సీజన్‌లోనే ఆన్‌లైన్ మోసాలు ఎక్కువగా జరుగుతున్నట్లు రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్(Right to Information Act) ద్వారా ఆర్‌బీఐ ఇచ్చిన వివరాల తెలుస్తోంది. 2020 నుంచి 2024 వరకు సైబర్ నేరాలకు సంబంధించి 5,82,000 కేసులు నమోదయ్యాయి. సైబర్ మోసానికి సంబంధించి లావాదేవీలు నిర్వహించేందుకు సైబర్ నేరగాళ్లు ప్రైవేటు బ్యాంకు ఖాతాలను ఎక్కువగా వినియోగిస్తున్నారు.కొటక్ మహీంద్ర బ్యాంక్, యాక్సిస్ బ్యాంక్, హెచ్డీఎఫ్సీ, ఐసీఐసీఐ, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(HDFC, ICICI, State Bank of India) బ్యాంకుల ద్వారానే సైబర్ నేరాల్లో కాజేసిన మొత్తంలో 62 శాతం లావాదేవీలు జరిగాయి. సైబర్ నేరాలకు చెందిన మోసపూరిత లావాదేవీల్లో దేశవ్యాప్తంగా జరిగిన కేసుల్లో 26 శాతం మహారాష్ట్ర నుంచే జరిగాయి. తర్వాతి స్థానాల్లో 23 శాతంతో తమిళనాడు(Tamil Nadu), 9 శాతంతో ఢిల్లీ నిలిచాయి. 3 శాతం సైబర్ నేరాలకు సంబంధించిన లావాదేవీలు తెలంగాణలో జరిగాయి.
పండగల వేళ ‘సైబర్’ పంజా..జర భద్రం గురూ
RELATED ARTICLES