ఆపరేషన్ సిందూర్ తర్వాత భారత్ సత్తా పాకిస్తాన్ కు తెలిసి వచ్చింది. తమకు అన్ని విధాలుగా నష్టమేనన్న నిర్ణయానికి వచ్చింది. అందుకే కాల్పుల విరమణ ప్రతిపాదనను ముందుగా తెచ్చిందన్నది విశ్లేషకుల అంచనా.పాకిస్తాన్ తమ దేశ పరిస్థితుల దృష్ట్యా తగ్గదు. తలవంచదు. దాని నైజం కూడా అది కాదు. ఎందుకంటే ఏ మాత్రం తేడా వచ్చినా ప్రభుత్వానికి ముప్పు ఏర్పడుతుంది. సైన్యం మీద కూడా తిరుగుబాటు జరిగే అవకాశాలున్న దేశం అది. అందుకే ఆచితూచి జాగ్రత్తగా నిర్ణయం తీసుకుంటుంది. పహాల్గామ్ దాడిలో ఇరవై ఆరు మంది అమాయకులను ఉగ్రవాదులను బలికొన్న తర్వాత పాక్ లైట్ గానే తీసుకుంది. లోలోపల సంతోషించింది.
ఉగ్రవాద స్థావరాలతో పాటు…ఎప్పుడైతే ఆపరేషన్ సిందూర్ ను మొదలు పెట్టి పాక్ లో ఉన్న తొమ్మిది ఉగ్రవాద స్థావరాలను ధ్వంసం చేయడంతో పాటు కీలకమైన టెర్రరిస్టునలు మట్టుబెట్టడంతో దానికి భారత్ శక్తి ఏంటో తెలిసి వచ్చింది. దీంతో పాటు పాక్ లోని అనేక ప్రాంతాల్లో భారత్ దాడులకు దిగింది. ఎయిర్ బేస్ లతో పాటు సైనిక స్థావరాలపై కూడా దాడులు చేసింది. నూర్ ఖాన్ ఎయిర్ బేస్ లో రన్ వే పూర్తిగా ధ్వంసం కావడంతో నష్టం జరగడంతో పాటు తీవ్ర స్థాయిలో వణికిపోయిందన్న వార్తలు వస్తున్నాయి. పాకిస్తాన్ కు చెందిన మొత్తం పదకొండు వాయు స్థావరాలపై భారత్ దాడులు చేసింది. కేవలం మూడు గంటల్లోనే ముగించిన ఈ దాడులతో పాక్ దిక్కుతోచని స్థితిలో పడిపోయిందన్నది అంతర్జాతీయ మీడియాలోనూ కథనాలు వెలువడుతున్నాయి. భారత్ జరిపిన దాడుల్లో…భారత్ జరిపిన దాడుల్లో సియాల్ కోట్, చునియాన్, స్కర్టు, వస్రూర్, సుక్కూరు, రాడార్స్ హిట్ వంటి స్థావరాలకు నష్టం వాటిల్లింది. ఇండియా బ్రహ్మోస్ తో పాటు సుఖోయ్ 30, సూపర్ సోనిక్ క్రూజ్ క్షిపణులను ప్రయోగించడంతో పాక్ కకావికలమయింది. ఆయుధాలను నిల్వఉంచే ప్రాంతాలపైనే కాకుండా నూర్ ఖాన్ ఎయిర్ బేస్ సమీపంలోనే పాక్ అణ్వాయుధాలు కూడా నిల్వ చేసే కమాండ్ కంట్రోల్ ఉంది. దానిపై దాడి చేస్తే జరిగే నష్టం ఊహించడానికి కూడా వీలులేదు. అలాంటి పరిస్థితులలో అమెరికా సాయాన్ని అర్థించిన పాక్ ఎలాగైనా భారత్ ను కాల్పుల విరమణకు ఒప్పించాలని అర్థించింది. వారికి అణ్వాయుధాల విషయం కూడా చెప్పడంతో అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఎంట్రీ ఇచ్చి ఇరుదేశాలతో మంతనాలు జరిపారని అంతర్జాతీయ మీడియా చెబుతుంది. అందుకే ట్రంప్ నిన్న అణుయుద్ధం తప్పిపోయిందని వ్యాఖ్యానించడం వెనక కూడా ఇదే కారణమంటున్నారు. ఒకవైపు ఉగ్రవాదుల స్థావరాలు, మరొకవైపు వైమానిక స్థావరాలపై దాడులు జరపడంతోనే పాక్ దిగిరాక తప్పలేదంటున్నారు.
పాకిస్తాన్ తేలిగ్గా దిగిరాలేదు.. నష్టాన్ని కళ్లారా చూసిన తర్వాతే దెబ్బకు దెయ్యం దిగి వచ్చింది
RELATED ARTICLES