ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి, సింగర్ సునీత, లిరిసిస్ట్ చంద్రబోస్ జడ్జ్ లుగా వ్యవహరిస్తున్నారు. రీసెంట్ గానే ఈ షో నుంచి ప్రవస్తి ఎలిమినేట్ అయింది. వాస్తవానికి ప్రవస్తి చాలా మంచి సింగర్. అలాంటి ప్రవస్తి అంత త్వరగా ఎలిమినేట్ అవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేసింది. ఎలిమినేషన్ తర్వాత ఈ రియాలిటీ షో పై సింగర్ ప్రవస్తి సంచలన వ్యాఖ్యలు చేస్తూ సోషల్ మీడియాలో వీడియోను పోస్ట్ చేసింది.
పాడుతా తీయగా ప్రోగ్రామ్ కు ఎవరైనా వెళ్లాలనుకుంటే ఎవరైనా రిఫరెన్స్ లేదా రికమండేషన్స్ తోనే వెళ్లండని, లేకపోతే అక్కడ అన్యాయం జరగడం ఖాయమంటూ ప్రవస్తి ఆవేదన వ్యక్తం చేసింది. 2017లో ఎస్పీబీ సర్ ఉన్నప్పుడు నేను పాడుతా తీయగాలో పార్టిసిపేట్ చేశా. అప్పుడు సీజన్ చాలా బావుండేది. ఆ తర్వాత సూపర్ సింగర్ షో లో విన్ అయ్యా. అందులో విన్ అయ్యాక కూడా పెద్దగా అవకాశాలు రాలేదని తెలిపింది.
అందుకే పాడుతా తీయగాలో మళ్లీ పార్టిసిపేట్ చేస్తే అవకాశాలొస్తాయనుకుని తాను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేశానని, కానీ దానికి జడ్జిలుగా వ్యవహరించే ఎవరి తీరూ బాలేదని ప్రవస్తి మాట్లాడింది. తానెలాంటి పాట పాడినా సునీత ఒక రకమైన ఎక్స్‌ప్రెషన్ పెట్టేదని, ఏవొక తప్పులు కావాలని వెతికేదని, కీరవాణికి తనపై లేనిపోనివన్నీ చెప్పేదని ప్రవస్తి తెలిపింది.
తాను పాడిన పాటల్లో లిరిక్స్ లో ఎక్కడా పొరపాట్లు లేకపోవడంతో చంద్రబోస్ తన గొంతులో ఆర్థ్రత లేదని కామెంట్ చేసేవాళ్లని, ఇక కీరవాణి తనను ఎన్నో రకాలుగా అవమానించారని, తన ఆర్థిక పరిస్థితులు బాలేక వెడ్డింగ్ షోస్ చేస్తే అలాంటి వెడ్డింగ్ షోస్ చేసేవాళ్లు తన దృష్టిలో సింగర్సే కాదని స్టేజ్ పై తనను చూస్తూ అన్నారని, అలాంటివెన్నోఅని తనను మానసికంగా వేధించారని ప్రవస్తి వెల్లడించింది.
షో లో ఉన్నప్పుడు తాను ఇవన్నీ చెప్పలేనని, అందుకే ఇప్పుడు ఇలా వీడియోను రికార్డు చేసి అందరి గురించి నిజాలు బయటపెడుతున్నానని, ఇలా చెప్పినందుకు తనకు ఛాన్సులు రావని తనకు తెలుసని, తాను కూడా ఇలాంటి ఇండస్ట్రీలో ఉండదలచుకోలేదని చెప్పిన సింగర్ ప్రవస్తి, ఈ వీడియో చేస్తున్నప్పుడు కూడా తనను ఎంతో మంది ఆపడానికి ప్రయత్నించారని, ఈ వీడియో చూశాక తనకు, తన ఫ్యామిలీకి ఏదైనా జరిగితే దానికి కారణం కీరవాణి, సునీత, చంద్రబోసేనని చెప్పింది. ప్రవస్తి మాట్లాడిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
పాడుతా తీయగా షో వెళ్తున్నారా.. నా మాట వినండి అంటున్న సింగర్ ప్రవస్తీ
RELATED ARTICLES