కేటుగాళ్ళ టెక్నాలజీ తెలిసి పోలీస్ లకే దిమ్మ తిరిగి పోయింది..ఇలా కూడా మోసం చేస్తారా అని ఆశ్చర్య పోయారు..బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నుంచి వస్తువులు కొనుగోలు చేసి, బిల్లు పేటీఎం ద్వారా చెల్లించి, మరలా తమ ఖాతాల్లోకి డబ్బు మళ్లించుకున్న ఘటన మధురానగర్ ఠాణా పరిధిలో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఎస్సార్‌నగర్‌లోని బజాజ్ ఎలక్ట్రానిక్స్ షోరూమ్ నుంచి గతనెలలో ముగ్గురు వ్యక్తులు రూ.4లక్షల విలువైన ల్యాప్‌టాప్‌లు, ఏసీలు, టీవీలు, సెల్‌ఫోన్‌లు కొన్నారు. డబ్బులు తమకు తెలిసివారు పేటీఎంలో చెల్లిస్తారనిచెప్పి, క్యూర్‌ఆర్ కోడ్‌ను అవతలి వ్యక్తికి పంపడంతో, రాజస్థాన్ నుంచి ఓ వ్యక్తి పేటీఎం ద్వారా చెల్లించాడు. డబ్బులు షోరూమ్ బ్యాంకు ఖాతాలో పడిన తర్వాత పరికరాలను తీసుకువెళ్లారు. అనంతరం రాజస్థాన్ నుంచి డబ్బులు చెల్లించిన వ్యక్తి ఛార్జ్‌బ్యాక్ ఆప్షన్‌ను వినియోగించి తన ఖాతానుంచి డబ్బులు తన ప్రమేయం లేకుండానే షోరూమ్‌కు బదిలీ అయ్యాయని తప్పుడు ఫిర్యాదు చేసి, చెల్లించిన డబ్బులు తిరిగి తమ ఖాతాల్లోకి మళ్లించుకున్నాడు. షోరూమ్ క్యాషియర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.ఇలాంటి దేశ ముదుర్లు ఉంటే వ్యాపారులు బిజినెస్ లు మనే యాల్సిందే




