spot_img
Wednesday, March 25, 2026
spot_img

పోలిస్ కస్టడీలో వెలుగులోకి ఖరత్నక్ విషయాలు అఖిల్ పహిల్వాన్‌ మాములోడు కాదు

ఫార్చూన్‌ హోటల్‌ అడ్డాగా నిర్వహిస్తోన్న బ్రోతల్ దందా గుట్టురట్టయింది. అఖిలేష్‌ పహిల్వాన్‌ అండ్‌ బ్యాచ్‌ ఉద్యోగాల పేరిట యువతుల్నివ్యభిచార రొంపిలోకి దింపుతున్న వైనం బయటపడింది

ఫార్చూన్‌ హోటల్‌లో ఆకస్మిక తనిఖీలు చేసిన పోలీసులు.. 16 మంది యువతుల్ని రెస్క్యూ చేశారు. నిర్వాహకులు అఖిలేష్‌ అండ్‌ బ్యాచ్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు. ఎలాంటి ప్రూఫ్స్ లేకుండా 25 రోజులుగా అమ్మాయిలను హోటల్లో నిర్బంధించి వారితో వ్యభిచారం చేయిస్తున్నట్టు దర్యాప్తులో తేలింది.

ఫార్చ్యూన్ హోటల్ లో 25 రూములలో 16 రూములను వ్యభిచారం కోసం వాడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. అంతేకాదు కూపీలాగితే ఇంటర్నేషనల్‌ లెవల్‌లో డొంక కదిలింది. నిందితుల నుంచి 22 మొబైల్స్‌ స్వాధీనం చేసుకున్నారు పోలీసులు. అఖిలేష్ మొబైల్ ఫోన్లో జాతీయ, అంతర్జాతీయ వ్యభిచారం ముఠా నిర్వాహకుల ఫోన్ నెంబర్లు బయటపడ్డాయి. అఖిలేష్‌ పహిల్వాన్‌ రోజుకి 20 నుంచి 30 కాల్స్ నిర్వాహకులతో మాట్లాడుతున్నట్టు కాల్‌డేటా ఆధారంగా గుర్తించారు పోలీసులు. అంతేకాదు సినీ ఇండస్ట్రీకి చెందిన జూనియర్ ఆర్టిస్టులకు సంబంధించి ఫోన్ నెంబర్లు కూడా అఖిల్ ఫోన్‌లో ఉన్నట్టు పోలీసులు గుర్తించినట్టు తెలిసింది

అఖిల్‌కి పరిచయం ఉన్న సినీ, రాజకీయ ప్రముఖుల దగ్గరికి కూడా అమ్మాయిలను పంపించినట్టు తెలుస్తుండటంతో.. ఆ దిశగా పోలీసులు ఆధారాలు సేకరిస్తున్నారు. 3 రోజుల పాటు కస్టడీకి తీసుకొని విచారించిన పోలీసులు.. కస్టడీ ముగియడంతో రిమాండ్‌కు తరలించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular