సైబర్ మోసగాళ్లు ఎదిగిపోయారు. ఎదుటోడి వీక్ పాయింట్ మీద దెబ్బకొడుతూ.డబ్బులను ఈజీగా కొట్టేస్తున్నారు..పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం
తాజాగా బెంగళూరుకు చెందిన ఇన్ఫోసిస్ ఉన్నతోద్యోగి దగ్గర్నుంచి అక్షరాలా మూడు కోట్ల డెబ్భై లక్షలు గుంజేశారు. ట్రాయ్ అధికారులు, సీబీఐ అధికారులు, ముంబై పోలీసుల పేరిట బెదిరించి భారీ మొత్తం కొట్టేశారు. మేం టెలికాం రెగ్యులేటరీ అధికారులం..
మీ పేరుతో ఉన్న సిమ్ కార్డ్‌ను దుర్వినియోగం చేశారంటూ.. బాధితుడికి ఫోన్ కాల్ వెళ్లింది. చట్టవిరుద్ధమైన ప్రకటనలను ప్రచారం చేశారంటూ ఆయన్ను భయపెట్టారు. ఆ తర్వాత ముంబై పోలీస్ విభాగానికి చెందిన సీనియర్ ఆఫీసర్ మీతో మాట్లాడతారంటూ ఫోన్ కాల్‌ను మరొకరికి షిఫ్ట్ చేశారు. మీరు విచారణ కోసం ముంబై, ఢిల్లీ రావాల్సి ఉంటుంది, మిమ్మల్ని అరెస్ట్ చేసే అవకాశమూ ఉందని హడలగొట్టాట్టి డబ్బులు కొట్టేశారు