బెట్టింగ్స్ యాప్స్ గురించి గత కొద్దీ రోజులుగా సోషల్ మీడియాలో బాగా చర్చలు జరుగుతున్నాయి. ఇక తెలంగాణ అడిషనల్ డీజీపీ సజ్జనార్ గారు ప్రపంచం యత్రికుడు అన్వేష్ తో వీడియో కాల్ ద్వారా జరిపిన సంభాషణ బాగా వైరల్ అయింది.యూట్యూబర్లు డబ్బుకు ఆశపడి బెట్టింగ్ యాప్స్ ను బాగా ప్రమోట్ చేసారు. తాజాగా వారందరు పేరు మోసిన సెలబ్రిటీలతో సహా పోలీసుల విచారణ ఎదుర్కొంటున్నారు. అయితే అన్వేష్ హర్ష సాయి లాంటి ఫేమస్ యూట్యూబర్లను టార్గెట్ చేయడంతో ఈ ఇష్యూ మీద యువ సామ్రాట్ తాజాగా సంచలన కామెంట్స్ చేసారు.
అన్వేష్ అన్ని యూట్యూబ్ వ్యూస్ కోసమే చేసాడు….
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ బాగా ఫేమస్ యూట్యూబర్. తెలుగులో యూట్యూబ్ ద్వారా ఎక్కువ మొత్తంలో సంపాదించే వారిలో మొదటి వరుసలో ఉంటారు. అయితే తాజాగా అన్వేష్ బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసే వారి గురించి మాట్లాడుతూ హర్ష సాయి వంటి వారి పేర్లు చెప్పడం, ఆల్రెడీ హర్ష సాయి ఈ విషయంలో పోలీసుల విచారణలో ఉన్నాడు. తాజాగా యూట్యూబర్ యువ సామ్రాట్ మాట్లాడుతూ అన్వేష్ కేవలం వ్యూస్ కోసం మాత్రమే బెట్టింగ్ యాప్స్ గురించి మాట్లాడాడు అంటూ కామెంట్ చేశాడు. బయ్యా సన్నీ, వంటి వారి కుటుంబాలను కూడా ఈయన కించపరిచాడు.
బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసేవారిది తప్పు కావచ్చు కానీ అలాంటి యాప్స్ కు ఎందుకు అనుమతి ఇస్తోంది ప్రభుత్వం. అంతే కాక కేవలం యూట్యూబర్లు మాత్రమే ప్రచారం చేసారా సినిమా వాళ్ళు అలాగే క్రికెటర్స్ కూడా చేసారు. వారి గురించి ఎందుకు మాట్లాడటం లేదు అంటూ సామ్రాట్ మాట్లాడారు. అన్వేష్ గురించి తెలుసు కేవలం వీడియోస్ కీ వ్యూస్ తగ్గినపుడు ఇలా వేరే యూట్యూబర్లు గురించి వివాద్దస్పద వాఖ్యలు చేస్తాడు. తన వీడియోస్ కీ ఎపుడైతే రీచ్ తగ్గుతుందో అపుడే ఇలాంటి వాటిని ఉపయోగించుకుంటాడు అంటూ అన్వేష్ మీద ఫైర్ అయ్యాడు సామ్రాట్. హర్ష సాయి బెట్టింగ్ యాప్స్ ప్రచారం చేసి తప్పు చేసి ఉండవచ్చు కాని అతను ఎంతో మందికి సహాయం చేశాడంటూ చెప్పారు యువ సామ్రాట్.
ప్రపంచ యాత్రికుడు అన్వేష్ చెప్పిన నిజాన్ని తొలిసారి బయటపెట్టిన యువసామ్రాట్
RELATED ARTICLES