డబ్బు ఉచ్చ నిచాలని మరిచిపోయేలా చేస్తుంది..డబ్బు కోసం తండ్రి ఉద్యొగం కోసంజీవితాన్ని జన్మని ఇచ్చిన తండ్రి నీ కిరాతకంగా చంపాలని పక్కా ప్లాన్ వేసాడు కొడుకు
ప్రభుత్వ ఉద్యోగి చనిపోతే, ఆ ఉద్యోగం కుటుంబంలోని ఎవరికైనా ఇవ్వాలనే రూల్ చాలా ప్రభుత్వ సంస్థలలో ఉంది. దీని ఆసరగా చేసుకొని ఓ క్రిమినల్ కొడుకు తండ్రిని చంపేయాలని స్కెచ్ వేసాడు.ఇందుకోసం కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించి.. చివరకు పోలీసులకు దొరికిపోయాడు. ఈ దారుణ ఘటన నవంబర్ 16న ఝార్ఖండ్‌లో చోటుచేసుకొంది. అసలు ఎం జరిగిందో తెలుసు కావాలి అంటే ఈ స్టోరీ లోకి లుక్ వేయాల్సిందే
రామ్‌గఢ్‌కు చెందిన రామ్‌జీ ముండా అనే వ్యక్తి కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. ఆయన సెంట్రల్ కోల్‌ఫీల్డ్ లిమిటెడ్ (సీసీఎల్)లో ఉద్యోగం చేస్తున్నాడు. అతని కొడుకు 25 ఏళ్ల అమిత్ ముండా ప్రస్తుతం ఖాళీగానే ఉంటున్నాడు. అయితే ప్రభుత్వ ఉద్యోగం కోసం అమిత్ దారుణ పథకం వేశాడు. తన తండ్రి మరణిస్తే ఆయన ఉద్యోగం తనకే వస్తుందని ఆశ పడ్డాడు. అందులో భాగంగా రామ్‌జీని చంపేందుకు అమిత్ కొంతమంది కిరాయి హంతకులతో బేరం మాట్లాడుకున్నాడు. నవంబర్ 16న రామ్‌గఢ్ జిల్లాలోని మత్కామా చౌక్ వద్ద మోటారుసైకిల్‌పై వచ్చిన కొందరు గుర్తుతెలియని దుండగులు.. రామ్‌జీ ముండాపై కాల్పులు జరిపారు. స్థానికులు రామ్‌జీని రామ్‌గఢ్‌లోని ఆసుపత్రిలో చేర్చగా.. పరిస్థితి విషమించడంతో ఆయన ప్రస్తుతం రాంచీలో చికిత్స పొందుతున్నారు.
కేసు నమోదు చేసిన పోలీసులు.. దర్యాప్తు చేస్తుండగా నమ్మలేని ఈ విషయం బయటపడింది. ఈ దాడి ఘటనలో రామ్‌జీ కుమారుడు అమిత్ ముండా ప్రమేయం ఉన్నట్లు తేలింది. ప్రభుత్వ ఉద్యోగం సంపాదించేందుకు రామ్‌జీ ముండా కుమారుడు అమిత్ ముండా కాంట్రాక్ట్ కిల్లర్లను నియమించుకున్నట్లు పట్రాటు సబ్ డివిజనల్ పోలీస్ ఆఫీసర్ బీరేంద్ర కుమార్ చౌదరి తెలిపారు. అమిత్‌ను అరెస్ట్ చేశామని, కాంట్రాక్ట్ హంతకుల అరెస్టు కోసం గాలింపు చర్యలు చేపట్టామని తెలిపారు.