పేగు బంధం ప్రశ్నార్థకం అవుతోంది.. ముక్కు మొఖం తెలియని వ్యక్తులతో ఆన్ లైన్ ప్రేమలు.. కట్టుకున్న వాళ్లను, కన్నవాళ్ళని వదిలేసి చెక్కేస్తున్నారు.కొన్నాళ్ళు పోయాక.. మోజు తీరిపోతోంది.. కళ్ళు తెరిచేలోపే… పాపం ప్రాణాంతకం అవుతోంది… జీవితాలు.. కుటుంబాలు విచ్చిన్నం అవుతున్నాయి… హత్యలు అరాచకాలు చివరి అంకం అవుతున్నాయి.. ఇన్స్టా గ్రామ్ లో పరిచయమైన వ్యక్తితో స్నేహం ప్రేమగా మారింది..ప్రియుడు తనవెంట రమ్మని వెంటపడడంతో… ముక్కుపచ్చలారని కన్నబిడ్డ ను దిక్కు లేని అనాధగా బస్ స్టాండ్ లో వదిలేసి వెళ్ళింది ఓ మానవత్వం లేని తల్లి.. అమ్మ ఎక్కడికి వెళ్ళిందో తెలియక బిక్కు బిక్కు మంటూ ఉండిపోయిన బిడ్డడిని గమనించిన ఆర్టీసీ సిబ్బంది పోలీసులకు సమాచారమివ్వడంతో… వారు వచ్చి సీసీ కెమెరాల ఆధారంగా ముందు తల్లి ఆనవాలు గుర్తించి… ఆమె భర్తకు సమాచారమిచ్చి పిలిపించి.. బిడ్డను ఆయనకు అప్పగించారు… ఈ దారుణమైన ఘటన నల్గొండ బస్ స్టాండ్ లో చోటు చేసుకుంది..నల్లగొండ జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో.. ఓ మహిళ 15 నెలల కొడుకుని వదిలేసి.. వేరే యువకుడితో బైక్ మీద వెళ్లిన సంఘటన వెలుగులోకి వచ్చింది. నల్లగొండ పట్టణంలోని పాత బస్తీకి చెందిన ఒక యువకుడితో.. హైద్రాబాద్ కు చెందిన నవీన అనే మహిళ ఇన్ స్టాగ్రామ్ లో పరిచయం అయ్యింది. మహిళకు పెళ్లి అయ్యి.. 15 నెలల బాబు ధనుష్ ఉన్నాడు. ఈ క్రమంలోనే.. భర్తను,15 నెలల పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు ప్లాన్ వేసింది. డైరెక్ట్ గా నల్లగొండ ఆర్టీసీ బస్టాండ్ కు బాబుతో పాటు వచ్చి.. ఆ బాబును బస్టాండ్ లోనే వదిలేసి వెళ్ళింది. ఆ తర్వాత.. ఆ పిల్లవాడు తల్లి కోసం వెతుకుతూ ఏడవడం చూసిన ప్రయాణికులు, డిపో సిబ్బంది.. నల్లగొండ టూ టౌన్ పోలీసులకు సమాచారం ఇచ్చారు.టూటౌన్ ఎస్సై సైదులు వెంటనే స్పందించి.. స్టేషన్ లోని సిబ్బందిని ఆర్టీసీ బస్టాండ్ కు పంపించారు. పోలీసులు.. బస్టాండ్ లోని అన్ని సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా.. బైక్ మీద వెళుతున్న ఓ మహిళ వీడియోను చూసి.. ఆ బాలుడు మమ్మీ అంటూ గుర్తించాడని తెలిపారు. ఆ బైక్ నెంబర్ ప్లేట్ ఆధారంగా.. విచారణ చేపట్టిన పోలీసులకు.. బైకు యజమాని నుంచి అతని స్నేహితుడు బైక్ తీసుకెళ్లినట్లు తేలిందట. అటువైపుగా విచారణ చేపట్టగా.. ఇంస్టాగ్రామ్ లో ఒక యువకుడు పరిచయమై.. భర్తను పిల్లాడిని వదిలేసి మహిళ వెళ్లేందుకు చేసిన ప్రయత్నమేనని పోలీసుల విచారణలో బయటపడింది.
ప్రియుడే కావాలి.. కన్నబిడ్డను బస్టాండ్ లో వదిలి తల్లి జంప్
RELATED ARTICLES