spot_img
Tuesday, July 22, 2025
spot_img

ఫోన్‌లో ఈ సిగ్నల్స్ కనిపిస్తే.. మీ స్క్రీన్‌ను ఎవరో రికార్డ్ చేస్తున్నట్లే..!

డిజిటల్ యుగంలో హ్యాకర్ల కారణంగా ప్రజలకు ఎప్పుడూ ముప్పు ఉంటోంది. సోషల్‌ మీడియా, మెయిల్స్‌, మెసేజ్‌లు, కాల్స్‌.. ఇలా అన్ని మార్గాల్లోనూ మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారు.గ్రీన్ నోటిఫికేషన్ : స్పైవేర్ సాఫ్ట్‌వేర్ సహాయంతో హ్యాకర్లు ఫోన్ స్క్రీన్లను రిమోట్‌గా రికార్డ్ చేయవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్‌లోని మైక్రోఫోన్, కెమెరా ఆన్‌లో ఉంటే, మీ స్క్రీన్ క్యాప్చర్ అవుతోందని అర్థం. ఈ రెండు ఆన్‌ అయినప్పుడు మీకు గ్రీన్‌ నోటిఫికేషన్‌ లైట్లు కనిపిస్తాయి. ఫోన్‌లో మైక్రోఫోన్ సిగ్నల్ కనిపిస్తే మీ మైక్రోఫోన్‌ను ఏదైనా యాప్‌ యాక్సెస్‌ చేస్తోందని అర్థం. మీ స్మార్ట్‌ఫోన్ స్క్రీన్‌ను ఎవరైనా రికార్డ్ చేస్తుంటే కెమెరా సింబల్‌ చుట్టూ బ్రాకెట్ కనిపిస్తుంది. ఇలాంటివి గుర్తిస్తే.. మీ ఫోన్ స్క్రీన్ లేదా ఏదైనా ఇతర రికార్డింగ్ కోసం ఏదైనా యాప్‌కి యాక్సెస్‌ ఇచ్చారా? లేదా? చూడండి. యాక్సెస్ క్యాన్సిల్ చేయండి.

ఫోన్‌లో ఉన్న యాప్స్‌ అన్నింటికీ కెమెరా, కరెంట్‌ లొకేషన్‌, మైక్రోఫోన్‌కి యాక్సెస్‌ను కంట్రోల్ చేయవచ్చు. డివైజ్‌ సెట్టింగ్స్‌లో యాప్ ద్వారా పర్మిషన్స్ మాడిఫై చేసే సదుపాయం ఉంది. వీటిని ఎలా యూజ్ చేయాలంటే.. ఈ ఆప్షన్‌తో, ఏదైనా యాప్‌ను యాక్టివ్‌గా ఉపయోగిస్తున్నప్పుడు మాత్రమే మీ ఫోన్ లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్‌కి యాక్సెస్‌ ఉంటుంది. యాప్ నుంచి ఎగ్జిట్‌ అయిన తర్వాత వీటన్నింటి యాక్సెస్ క్యాన్సిల్ అవుతుంది. ఈ ఆప్షన్‌ ఎనేబుల్ చేస్తే, యాప్‌ని ఓపెన్‌ చేసిన ప్రతిసారి లొకేషన్, కెమెరా, మైక్రోఫోన్‌ని యాక్సెస్ చేయడానికి పర్మిషన్ కోసం యాప్ మిమ్మల్ని అడుగుతుంది. ఈ ఆప్షన్‌ సెలక్ట్ చేస్తే, యాప్ యూజ్‌ చేస్తున్నప్పుడు కూడా డివైజ్ లొకేషన్‌, కెమెరా, మైక్రోఫోన్‌కు పూర్తిగా యాక్సెస్ లభించదు.యాప్ పర్మిషన్స్ ఎలా మార్చాలి : మీ ఆండ్రాయిడ్‌ ఫోన్‌లో సెట్టింగ్స్‌ అప్లికేషన్‌ ఓపెన్‌ చేయండి. అనంతరం యాప్స్‌ ఆప్షన్‌ ఓపెన్‌ చేసి పర్మిషన్స్‌ మార్చాలనుకుంటున్న యాప్‌ను ఎంచుకోండి. తర్వాత, యాప్‌పైన ట్యాప్‌ చేసి, పర్మిషన్స్‌ ఆప్షన్‌ సెలక్ట్‌ చేయండి. కెమెరా, కాంటాక్ట్స్‌, లొకేషన్‌, మైక్రోఫోన్‌ వంటివి కనిపిస్తాయి. మేనేజ్‌ చేయాలనుకుంటున్న పర్మిషన్‌పై క్లిక్ చేస్తే, కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. ‘అలో వైల్‌ యూజింగ్‌ ది యాప్‌’, ‘డోంట్‌ అలో’, ‘ఆస్క్‌ ఎవ్రీ టైమ్‌ ఫర్‌ ద స్పెసిఫిక్‌ యాప్‌’.. వీటిలో మీకు ఏది అవసరమైతే, అది ఎంచుకోండి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular