spot_img
Thursday, February 5, 2026
spot_img

ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అధికారులకు కేటీఆర్ ఇండైరెక్ట్ వార్నింగ్…

అధికారంలోకి వచ్చాక ప్రతి నోటీసుకి సమాధానం తప్పదు!

SIT నోటీసులపై ఘాటు స్పందన – ‘లొట్టపీసు కేసు’ అంటూ ఎద్దేవా

ఫోన్ ట్యాపింగ్ కేసులపై రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఈ వ్యవహారంపై కేటీఆర్ తీవ్ర స్థాయిలో స్పందిస్తూ, కేసుల విచారణ చేస్తున్న అధికారులకు ఇండైరెక్ట్ వార్నింగ్ ఇచ్చారు.
SIT నోటీసులపై స్పందించిన కేటీఆర్,

“మేము అధికారంలోకి వచ్చిన తర్వాత ఎవరి ఆదేశాలతో, ఎవరి ఫోన్లు ట్యాప్ చేయించారో పూర్తిస్థాయిలో దర్యాప్తు చేయిస్తాం”

అని స్పష్టం చేశారు.
‘లొట్టపీసు కేసు’ అంటూ విమర్శలు
ఫోన్ ట్యాపింగ్ కేసును కేటీఆర్ ‘లొట్టపీసు కేసు’గా అభివర్ణిస్తూ, ఇది పూర్తిగా రాజకీయ కక్ష సాధింపులో భాగమని ఆరోపించారు.

ప్రస్తుతం జరుగుతున్న దర్యాప్తుల్లో కొంతమంది అధికారులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారని, రేపు అధికారం మారితే అదే అధికారులు ప్రజలకు, సమాజానికి సమాధానం చెప్పాల్సి వస్తుందని హెచ్చరించారు. ముగ్గురు మంత్రుల మధ్య వాటాల పంచాయతీ… జర్నలిస్టుల అరెస్టులు ముగ్గురు మంత్రుల మధ్య జరిగిన అంతర్గత వాటాల పంచాయతీ కారణంగా ముగ్గురు జర్నలిస్టులను అరెస్ట్ చేశారంటూ కేటీఆర్ సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఇప్పుడు అదే ధోరణిలో ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కూడా అధికారులు ముందుకు వెళ్తున్నారని విమర్శించారు.
ప్రతిపక్షమే కాదు… అధికార పక్షం ఫోన్లూ ట్యాప్?
ఫోన్ ట్యాపింగ్ అనేది కేవలం ప్రతిపక్ష నేతలకే పరిమితం కాలేదని, అధికార పక్షంలోని కొందరు నాయకుల ఫోన్లు కూడా వింటున్నారనే విషయం గతంలోనే మీడియాలో వచ్చిందని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇలాంటి పరిస్థితుల్లో విచారణ పేరుతో నోటీసులు జారీ చేస్తున్న ప్రతి అధికారి రేపు తప్పనిసరిగా సమాధానం చెప్పాల్సిందేనని స్పష్టం చేశారు.

రాజకీయ నాయకుల క్రీడలో IAS  and IPS అధికారులే బలి అవుతున్నారు?

గతంలో కేసీఆర్ ప్రభుత్వ హయాంలో పనిచేసిన పలువురు అధికారులు, అధికారం మారగానే కేసుల్లో ఇరుక్కొని జైలు పాలయ్యారని కేటీఆర్ గుర్తు చేశారు.

ఇప్పుడు రేవంత్ రెడ్డి ప్రభుత్వంలోనూ అదే పరిస్థితి కొనసాగుతుందా? అని ప్రశ్నించారు.

అటు ఆంధ్రప్రదేశ్‌లో కూడా జగన్ మోహన్ రెడ్డి హయాంలో, అంతకుముందు ప్రభుత్వంలో పనిచేసిన అధికారులపై కేసులు పెట్టి జైళ్లకు పంపిన ఉదంతాలను ఉదాహరణగా ప్రస్తావించారు.
IAS, IPSలు ప్రజాసేవ కోసమా… రాజకీయ బలిపశువులా?

IAS, IPS అధికారులు ప్రజాసేవ చేయాలనే ఉద్దేశంతో చదువుకుంటే, రాజకీయ నాయకుల క్రీడలో సమిధలుగా మారుతున్నారని కేటీఆర్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒకవైపు ప్రభుత్వానికి అనుకూలంగా ఉంటే మంచి పోస్టులు, మరోవైపు అనుకూలంగా లేకపోతే లూప్  లైన్ లో పెట్టడం లేదా కేసులు – ఇదే పరిస్థితి కొనసాగుతోందని విమర్శించారు.

కేంద్రం కూడా నిఘా?

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని కేంద్ర ప్రభుత్వం కూడా సీరియస్‌గా పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇంటెలిజెన్స్ బ్యూరో ద్వారా జరుగుతున్న కేసులపై పూర్తి నివేదికలు తెప్పించుకున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.
రేపు అధికారం మారితే… జైలు తప్పదా?

ఇప్పుడు అధికారంలో ఉన్నవాళ్లే రేపు అధికారం మారగానే కేసుల్లో ఇరుక్కొని జైలు పాలవ్వాల్సిందేనా?

ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో అత్యుత్సాహం చూపిస్తున్న అధికారులు భవిష్యత్తులో ఎలాంటి పరిస్థితిని ఎదుర్కొంటారన్నది వేచి చూడాల్సిందే.

కేటీఆర్ ఇచ్చిన ఈ ఘాటు హెచ్చరిక రాజకీయంగా కాకుండా, పరిపాలనా వ్యవస్థలోనూ తీవ్ర చర్చకు దారి తీస్తోంది. ఇకపై పోలీస్ యంత్రాంగం ఏ దిశగా స్పందిస్తుందో తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular