హైదరాబాద్ లో మరో భారీ మోసం బయటపడింది. దాదాపు రూ.100 కోట్ల మోసం జరిగినట్లు తెలిసింది. అయితే సాధారణంగా మోసాల్లో ఎక్కువగా సామాన్య, మధ్యతరగతి ప్రజలు మోసపోతారు కానీ ఈ కేసులో సెలబ్రిటీలు మోసపోయారు.
ప్రముఖలే టార్గెట్ భారీ మోసానికి పాల్పడ్డాడు. తృతీయ జ్యూవెలరీ అధినేత కాంతి దత్ సినీ సెలబ్రిటీల వద్ద భారీ మొత్తంలో పెట్టుబడులు రాబట్టి హ్యాండ్ ఇచ్చినట్లు తెలిసింది. అతను సస్టెయిన్ కార్ట్ పేరుతో మోసాలకు పాల్పడ్డాడు.
చాలా మందిని కాంతి దత్ తమ కంపెనీకి పరిణీతి చోప్రా బ్రాండ్ అంబాసిడర్ అని నమ్మించాడు. డబ్బున్న వారినే టార్గెట్ గా ముందుకెళ్లాడు. ఇందుకోసం భారీగా ఖర్చు చేశాడు. దీంతో చాలా మంది అతన్ని నమ్మాడు. కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టారు. తర్వాత మోసపోయామని తెలుసుకున్నారు. గప్ చుప్ గా ఉన్నారు. అయితే శ్రీజరెడ్డి అనే మహిళ కాంతి దత్ నమ్మి పెట్టుబడి పెట్టింది. మోసమని తెలుసుకుని జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.
కాంతి దత్ వ్యాపారవేత్తలు, సినీ హీరోయిన్ల నుంచి దాదాపు రూ.100 కోట్లు పెట్టుబడి సేకరించినట్లు తెలిసింది. కాంతి దంత్ సినీ నటులు సమంత, కీర్తి సురేష్, డిజైనర్ శిల్పారెడ్డి నుంచి డబ్బులు వసూలు చేసినట్లు తెలిసింది. దీనిపై పోలీసులు క్లారిటీ ఇవ్వాల్సిన అవసరం ఉంది. అతనిపై సంతకాలను ఫోర్జరీ చేసి మోసాలకు పాల్పడినట్లు అభియోగాలు నమోదయ్యాయి. కాంతి దత్ పై సీసీఎస్ లో కూడా కేసు నమోదు అయినట్లు సమాచారం. సస్టెయిన్ కార్ట్ తో తనకు ఎలాంటి సంబంధం లేదని శిల్పారెడ్డి చెప్పారు. ఏడాదిన్నర క్రితమే అందులో నుంచి బయటికి వచ్చానని నెలరోజుల క్రితం ఆమె తెలిపారు.
కాంతి దత్ వ్యాపార పద్ధతులు నా నైతికత, సూత్రాలకు అనుగుణంగా లేవని ఆమె చెప్పారు. ఆ సంస్థతో తకు ఇంకేమీ సంబంధం లేదని స్పష్టం చేశారు. సహ-వ్యవస్థాపకుడు మిస్టర్ కాంతి దత్‌తో నాకు వృత్తిపరమైన లేదా వ్యక్తిగత సంబంధం లేదని శిల్పారెడ్డి స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.