spot_img
Sunday, July 20, 2025
spot_img

బిజినెస్‌మ్యాన్ ఇంట్లో చోరీ.. ఒంటరిగా ఉన్న భార్యపై గ్యాంగ్ రేప్.. సిగరెట్లతో కాల్చిన శాడిస్టులు

ఉత్తరప్రదేశ్‌లోని ఓ బిజినెస్ మ్యాన్ ఇంటిలో ఐదుగురు దొంగలు పడ్డారు. విలువైన వస్తువులను, డబ్బును సేకరించారు. అదే సమయంలో ఇంట్లో ఆ వ్యాపారి భార్య ఒక్కరే ఉన్నారు.దొంగతనం చేయడంతోపాటు వారంతా ఆమెపైనా కర్కశంగా గ్యాంగ్ రేప్ చేశారు. ఆమెను తాళ్లతో కట్టేసి సామూహిక లైంగిక దాడికి ఒడిగట్టారు. సిగరెట్ల మొనలతో ఆమె చర్మంపై కాల్చారు. ఈ ఘటన యూపీలోని బిజ్నోర్ జిల్లాలో చోటుచేసుకుంది.

ఆ బిజినెస్‌మ్యాన్ తన తల్లి, పిల్లలతో కలిసి చికిత్స కోసం ఓ వైద్యుడి వద్దకు వెళ్లారు. ఆ సమయంలో వ్యాపారి భార్య ఒక్కరే ఉన్నారు. ఆ దొంగలు మద్యం మత్తులో ఉన్నారు. ఇంట్లోకి చొరబడి బంగారు నగలు, రెండు కిలోల వెండి వస్తువులు, రూ. 1.5 లక్షల నగదును పట్టుకున్నారు. అలాగే.. ఓ స్కూటర్, ఎల్‌ఈడీ టీవీని కూడా వారు పట్టుకుని వెళ్లడానికి సిద్ధం చేసుకున్నారు. అల్మారా, ఇతర గదుల తాళాలను కట్ చేసి ఈ దొంగతనానికి తెరలేపారు.

వ్యాపారి భార్యకూ మత్తు ఇచ్చారు. ఆమెను తాళ్లతో కట్టేశారు. ఆ తర్వాత దొంగలు సామూహిక లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం, ఆ వస్తువులను అన్నింటిని పట్టుకుని పారిపోయారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular