spot_img
Monday, March 23, 2026
spot_img

బిజెపి ఎంపి పాస్‌తోనే పార్లమెంటులోకి .. ఆగంతకుల అరెస్ట్‌

పార్లమెంటులోకి చొరబడిన ఇద్దరు ఆగంతకులను భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అయితే బిజెపి మైసూర్‌ ఎంపి ప్రతాప్‌సిన్హా ఆగంతకుల్లో ఒకరికి ‘సాగర్‌ శర్మ’ పేరుతో విజిటర్స్‌ పాస్‌ జారీ చేసినట్లు సమాచారం.సమావేశం జరుగుతుండగా సందర్శకుల గ్యాలరీ నుండి ఇద్దరు వ్యక్తులు లోక్‌సభ చాంబర్‌ వైపు దూసుకువచ్చిన సంగతి తెలిసిందే. అప్రమత్తమైన ఎంపిలు , భద్రతా సిబ్బంది వారిని అదుపులోకి తీసుకున్నారు. దీంతో స్పీకర్‌ సభను వాయిదా వేశారు.

పార్లమెంటు ఎదుట నిరసన చేపట్టిన ఆందోళనకారులను కూడా అదుపులోకి తీసుకున్నట్లు ఢిల్లీ పోలీసులు తెలిపారు. వీరు ఎరుపు, పసుపు రంగు పొగలను వదిలి ఆందోళన చేపట్టినట్లు సమాచారం. వీరిలో ఒక మహిళ కూడా ఉన్నట్లు తెలిపారు.ఈ ఘటనపై కాంగ్రెస్‌ ఎంపి అధిర్‌ రంజన్‌ చౌదరి స్పందించారు. సభలో జీరో అవర్‌ జరుగుతుండగా ఒక వ్యక్తి లోక్‌సభలోని బెంచీల మీద నుండి దూకారని, మరొకరు సందర్శకుల గ్యాలరీ నుండి ఓ రకమైన పొగను వదిలారని అన్నారు. ఈ ఘటనలో భద్రతా సిబ్బంది వైఫల్యం కనిపిస్తోందని అన్నారు. నేడు 2001లో పార్లమెంటు దాడి మృతుల వర్థంతి జరుపుకుంటుండగా .. ఈ ఘటన చోటుచేసుకోవడం పూర్తిగా భద్రతా వైఫల్యమేనని వ్యాఖ్యానించారు. ఇదో భయంకరమైన ఘటన అని టిఎంసి ఎంపి సుదీప్‌ బందోపాధ్యాయ పేర్కొన్నారు. ఆగంతకుల లక్ష్యం ఏమిటీ, ఎందుకు ఈ చర్యకు పాల్పడ్డారో ఊహించలేదని అన్నారు. అందరం సభ నుండి బయటకు వచ్చామని, ఇది పూర్తిగా భద్రతా వైఫల్యమేనని అన్నారు. కంటెయినర్‌లతో వారు ఎలా లోపలికి రాగలరని ప్రశ్నించారు. 20 ఏళ్ల వయస్సు గల ఇద్దరు వ్యక్తులు అకస్మాత్తుగా విజిటర్స్‌ గ్యాలరీ నుండి హౌస్‌లోకి ప్రవేశించారని కాంగ్రెస్‌ ఎంపి కార్తి చిదంబరం వ్యాఖ్యానించారు. వారి చేతుల్లో కంటెయినర్‌లు ఉన్నాయని, పసుపు రంగుపొగతో ఉన్నాయని, వారు స్పీకర్‌ వైపుకు దూసుకువెళ్లారని అన్నారు. ఆ పొగ విషంతో కూడినదైతే ఏమి చేయగలమని ప్రశ్నించారు. పూర్తిగా భద్రతా వైఫల్యమేనని అన్నారు.

బిజెపి ఎంపి పాస్‌తోనే పార్లమెంటులోకి .

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular