తెలంగాణలో బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులను రాష్ట్ర ప్రభుత్వం సీరియస్ గా తీసుకుంది. బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తు చేపట్టేందుకు తెలంగాణ ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసింది.మొత్తం 5 గురు పోలీస్ అధికారులతో స్పెషల్ టీం ఏర్పాటు చేసింది. సిట్ చీఫ్ గా సీఐడి డీజీ ఎం రమేష్ను నియమించారు. ఈ మేరకు తెలంగాణ డీజీపీ జితేందర్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ సిట్ టీంలో సీనియర్ పోలీస్ అధికారి ఐజీ రమేష్ రెడ్డి, ఎస్పీలు సింధు శర్మ, వెంకట లక్ష్మి, అడిషనల్ ఎస్పీ చంద్రకాంత్, డీఎస్పీ శంకర్ సభ్యులుగా ఉంటారు. 90 రోజుల్లో దర్యాప్తు పూర్తి చేయాలని ఆదేశాలు జారీ చేశారు.
ఆన్లైన్ బెట్టింగ్ కు సంబంధించి కేసులను సిట్ కు బదిలీ చేయనున్నారు. ఆన్లైన్ బెట్టింగును నిరోధించేందుకు తీసుకోవాల్సిన చర్యలను సైతం సిట్ ప్రభుత్వానికి సూచించనుంది. పేమెంట్ లకు సంబంధించిన వ్యవహారాలపై RBI కి సిట్ సూచనలను చేయనుంది
బెట్టింగ్ యాప్స్ కేసు దర్యాప్తునకు సిట్ ఏర్పాటు, సిట్ చీఫ్‌గా రమేష్
RELATED ARTICLES