తమిళ నటుడు విశాల్ నిజంగానే భయంకరమైన జబ్బుతో బాధపడుతున్నాడా.. ఇంతకీ విశాల్ కి ఉన్న ఆ జబ్బు ఏంటి.. ఎందుకు అలా మాటిమాటికి అనారోగ్యం పాలవుతున్నారు అనేది ఇప్పుడు చూద్దాం..కోలీవుడ్ నటుడు విశాల్ ప్రతిసారి వార్తల్లో నిలుస్తున్నారు.. ఓవైపు తన సినిమాలతో మరోవైపు తన పెళ్లితో, ఇంకోవైపు తన హెల్త్ కి సంబంధించిన వార్తలతో ఎప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గానే ఉంటున్నారు.విశాల్ స్పృహ తప్పి పడిపోయిన సంగతి మనకు తెలిసిందే.విల్లుపురంలో జరిగిన ఓ కార్యక్రమానికి చీఫ్ గెస్ట్ గా వచ్చారు విశాల్. అందులో మాట్లాడుతూనే ఒక్కసారిగా స్పృహ తప్పి స్టేజి మీద కుప్పకూలిపోయాడు. దీంతో అక్కడే ఉన్న విశాల్ సిబ్బంది వెంటనే హాస్పిటల్ కి తరలించారు.దాంతో విశాల్ ఆరోగ్యానికి సంబంధించి ఎన్నో రూమర్లు తెరమీద వినిపించాయి.
అయితే ఈ రూమర్లకు తెర పడేలా విశాల్ మేనేజర్ ఆయన మధ్యాహ్నం పూట ఆహారం తీసుకోలేదని,జ్యూస్ తీసుకోవడం వల్లే అలా నిరసపడి స్పృహ తప్పి పడిపోయారని,ఇందులో భయపడాల్సిన పనేమీ లేదని చెప్పారు. కానీ కోలీవుడ్ మీడియాలో మాత్రం మరో విధంగా రూమర్ల చెక్కర్లు కొడుతున్నాయి.విశాల్ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నారని, ఆయన పదేపదే అనారోగ్యం బారిన పడడానికి కారణం అదేనని, చావు అంచుల వరకు వెళ్తారు అంటూ సోషల్ మీడియాలో పిచ్చిరాతలు రాస్తున్నారు. మరి విశాల్ ఆరోగ్యం పై వస్తున్న వార్తల్లో ఉన్న నిజం ఎంతో తెలియాల్సి ఉంది.
భయంకరమైన వ్యాధి బారిన పడ్డ విశాల్.. చావు అంచుల్లో.?
RELATED ARTICLES