spot_img
Sunday, July 20, 2025
spot_img

భరణం పొందాలంటే 8 కొత్త రూల్స్.. జారీ చేసిన సుప్రీంకోర్టు

బెంగళూరులో ఓ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. తన మృతికి కారణం భార్యే అన్నాడు. ఆమె నెలకు రూ.2లక్షల భరణం ఇవ్వాలని కండీషన్ పెట్టిందనీ, అంత తాను ఎక్కడ ఇచ్చుకుంటానని లబోదిబోమన్నాడు.అలా కాదంటే రూ.3 కోట్లు ఇవ్వాలని కూడా డిమాండ్ చేసిందని తెలిపాడు. ఇదంతా అతని వెర్షన్. కానీ.. ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చగా మారింది. అసలు భరణం ఎంత ఇవ్వాలి అనేది టాపిక్ అయ్యింది. ఇలాంటి పరిస్థితుల్లో విడాకులు తీసుకున్నప్పుడు.. నిర్వహణ ఖర్చుల కింద భార్యకు ప్రతి నెలా భర్త ఎంత భరణం (మనోవర్తి) ఇవ్వాలో 8 పాయింట్లలో తేల్చేసింది.

సుప్రీంకోర్టు ఏం చెప్పింది?
ఈ విషయంపై దేశ అత్యున్నత న్యాయస్థానం బాగా చెప్పింది. మనోవర్తి అనేది భర్త చెల్లించలేని విధంగా, అతను నా వల్ల కాదు బాబోయ్ అనిపించేలా, మనోవర్తి చెల్లించడం అతనికి ఒక శిక్షలా ఉండకూడదు అని సుప్రీంకోర్టు చెప్పింది. అలాగే భార్యకు ఇచ్చే భరణం.. ఆమె సమాజంలో గౌరవంగా బతికేలా ఉండాలని కూడా చెప్పింది. ఈ సందర్భంగా 8 రూల్స్‌ని జస్టిస్ విక్రమ్ నాథ్, జస్టిస్ బి వరాలేతో కూడిన ద్విసభ్య ధర్మాసనం చెప్పింది.

సుప్రీంకోర్టు చెప్పిన 8 రూల్స్:
భార్యకు వచ్చే ఆదాయం, కలిగివున్న ఆస్తులు
భర్త ఆదాయం, అప్పులు, అతనికి భరణం వల్ల కలిగే భారం
భార్యపై ఆధారపడిన పిల్లల పరిస్థితులు
దంపతులు ఆర్థిక, సామాజిక పరిస్థితులు
ఇద్దరి చదువు, ఉద్యోగాల పరిస్థితులు
అత్తారింట్లో భార్యకి ఉన్న ఫైనాన్షియల్ స్టేటస్
కుటుంబం కోసం భార్య ఉద్యోగాన్ని వదులుకుంటే, ఆ త్యాగానికి ఉన్న విలువ.
ఉద్యోగం చెయ్యని భార్య, భరణం కోసం పోరాడుతూ ఉండగా కోర్టుల్లో అయిన ఖర్చు ఏ కేసులో చెప్పింది?
ఇంతకీ సుప్రీంకోర్టు ఎందుకు ఈ రూల్స్ చెప్పింది అంటే.. దీనికి ఒక కేసు కారణంగా ఉంది. ఆ కేసులో దంపతులు.. ఆరేళ్లపాటూ కలిసి జీవించారు. తర్వాత విడిపోయారు. కానీ విడాకులు తీసుకోలేదు. అలా 2 దశాబ్దాలు గడిచిపోయాయి. ఇప్పుడు వాళ్లకు విడాకులు తీసుకోవాలి అనిపించింది. ఐతే.. భరణం ఎంత ఇవ్వాలి అనే అంశం వారికి సెట్ కాలేదు. దాంతో కేసు సుప్రీంకోర్టు దాకా వెళ్లింది. అత్యున్నత ధర్మాసనం చెప్పిన 8 రూల్స్ ప్రకారం ఇప్పుడు వారికి భరణం డీల్ కుదరనుంది.

భరణానికి సుప్రీంకోర్టు చెప్పిన రూల్సే ఫైనల్ కాదు. ఇంకా చాలా అంశాలను లెక్కలోకి తీసుకోవచ్చు. కాకపోతే.. ఈ రూల్స్ ఆధారంగా నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది. అందుకే అన్ని కోర్టులూ.. వీటిని లెక్కలోకి తీసుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular