spot_img
Monday, March 23, 2026
spot_img

భారతదేశం డిజిటల్ భవిష్యత్తు వైపు ముందడుగు


డిజిటల్ యుగం వేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో, ప్రపంచ వ్యాప్తంగా డిసెంబర్ 2న “ప్రపంచ కంప్యూటర్ సాక్షరత దినోత్సవం”ను పురస్కరించుకొని వివిధ విద్యా సంస్థలు, ప్రభుత్వ విభాగాలు, టెక్నాలజీ సంస్థలు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నాయి. డిజిటల్ విద్య, సైబర్ భద్రత, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వంటి కీలక నైపుణ్యాలపై ప్రజల్లో చైతన్యం పెంచడమే ఈ దినోత్సవం లక్ష్యం.

భారత ప్రభుత్వ డిజిటల్ ప్రయాణంలో 1976లో NIC స్థాపనతో కంప్యూటర్ వినియోగం ప్రభుత్వ రంగంలో ప్రవేశించింది. 1988లో ERNET ద్వారా ఇంటర్నెట్ భారత్‌కు చేరింది. 2000లో IT Act ఆమోదంతో ఇ-రెక్కార్డులు, డిజిటల్ సిగ్నేచర్లకు చట్టబద్ధత లభించింది. డిజిటల్ ఇండియా కార్యక్రమం (2015) ప్రారంభమైన తరువాత UPI, Aadhaar, DigiLocker, UMANG వంటి డిజిటల్ సేవలు కోట్లాది పౌరుల జీవితాన్ని మార్చాయి.

నేటి పరిస్థితుల్లో కంప్యూటర్ సాక్షరత కేవలం ఆపరేటింగ్ పరిజ్ఞానం మాత్రమే కాకుండా, AI అవగాహన, సైబర్ సెక్యూరిటీ, డిజిటల్ హైజీన్ వంటి అంశాలు కూడా అత్యవసరంగా మారాయి. బలమైన పాస్‌వర్డ్‌లు, ఫిషింగ్ పట్ల జాగ్రత్తలు, డేటా ప్రైవసీ వంటి అంశాలపై సమాజంలో విస్తృతమైన అవగాహన అవసరమని నిపుణులు పేర్కొంటున్నారు.

గ్రామీణ ప్రాంతాలు, మహిళలు, వృద్ధుల్లో డిజిటల్ ఇన్క్లూజన్ పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టాల్సిన అవసరాన్ని అధికారులు వేళ్లడిస్తున్నారు. NEP 2020లో కోడింగ్, డేటా లిటరసీ, కంప్యూటేషనల్ థింకింగ్‌ను విద్యా వ్యవస్థలో తప్పనిసరి భాగాలుగా చేయడం ఈ దిశలో ముందడుగు.

ఐటీ నిపుణులు అభిప్రాయపడుతూ—“డిజిటల్ నైపుణ్యాలు భవిష్యత్తు ఉద్యోగాలు, పరిశ్రమలు, పరిశోధనల్లో కీలక పాత్ర పోషించనున్నాయి. కంప్యూటర్ సాక్షరత ఇప్పుడు వ్యక్తిగత అభివృద్ధి నుంచీ జాతీయ డిజిటల్ రక్షణ వరకు విస్తరించింది” అని తెలిపారు.

డా. అర్జునరావు రాజనాల M.Tech,Ph.D
విభాగాధిపతి (HOD), కంప్యూటర్ సైన్స్ విభాగం
అరోరా పీజీ కాలేజ్‌‌, చిక్కడపల్లి, హైదరాబాదు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular