spot_img
Tuesday, March 24, 2026
spot_img

భార్యాపిల్లల్ని చంపి సూసైడ్ చేసుకున్న డాక్టర్

వైద్యుడు భార్య, ఇద్దరు పిల్లల్ని చంపి.. ఆపై తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని రాయ్‌బరేలీ జిల్లాలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం..

డాక్టర్‌ అరుణ్‌ సింగ్‌.. రాయ్‌బరేలీలోని లాల్‌గంజ్‌ ప్రాంతంలో గల మోడ్రన్‌ రైల్‌ కోచ్‌ ఫ్యాక్టరీలో అసిస్టెంట్‌ డివిజనల్‌ మెడికల్‌ ఆఫీసర్‌‎గా పనిచేస్తున్నాడు. అతడు కంటి స్పెషలిస్ట్‌. అయితే, అరుణ్‌ గత కొన్ని రోజులుగా డిప్రెషన్‌తో బాధపడుతున్నట్లు రాయ్‌బరేలీ ఎస్పీ అలోక్‌ ప్రియదర్శి తెలిపారు. ఇంజక్షన్ల ద్వారా భార్య, పిల్లల్ని (14 ఏళ్ల కుమార్తె, 5 ఏళ్ల బాబు) చంపినట్లు గుర్తించామన్నారు. ఆ తర్వాత అరుణ్‌ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాలను స్వాధీనం చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఆయన వెల్లడించారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular