హయత్‌నగర్ వినాయకనగర్‌లోని ఎల్బీనగర్ కాంగ్రెస్ అభ్యర్థి మధుయాస్కీ నివాసంలో మంగళవారం అర్ధరాత్రి ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్, పోలీసులు సోదాలు నిర్వహించారు.డబ్బులు పంపిణీ చేస్తున్నట్లు ఫిర్యాదు రావడం వల్ల తనిఖీలకు వచ్చినట్లు పోలీసులు చెప్పారు. ఈ సందర్భంగా యాస్కీ మాట్లాడుతూ అనుమతి లేకుండా ఇంట్లోకి చొరబడి సోదాలు చేయడం ఏమిటని ప్రశ్నించారు. అర్ధరాత్రి కుటుంబసభ్యులను, కార్యకర్తలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓడిపోతున్నాననే భయంతో ఎల్బీనగర్ ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డి పోలీసులను పంపారని ఆరోపించారు.
మధుయాస్కీ ఇంట్లో అర్ధరాత్రి ఇంట్లో ఎన్నికల ఫ్లయింగ్ స్క్వాడ్ సోదాలు
RELATED ARTICLES