డిజిటల్ యుగంలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI) వాడకం పెరిగిపోయింది. మానవుడు పరిష్కరించలేని అనేక సమస్యలకు ఏఐ సమాధానం ఇస్తోంది. దీంతో ఏఐ టూల్స్ అయిన చాట్ జీపీటీ, గ్రోక్, జెమినీ, ఓపెన్ ఏఐ లను ప్రజలు తమ నిత్య కృత్యాల్లో భాగంగా మార్చుకున్నారు.ఈ క్రమంలో ఓ సంచలన రిపోర్టు తాజాగా బయటకు వచ్చింది.
ప్రముఖ ఏఐ టూల్ చాట్ జీపీటీపై ప్రఖ్యాత విశ్వవిద్యాలయం మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ జరిపిన పరిశోధనల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. మానవ మెదడుపై చాట్ జీపీటీ ఎలాంటి ప్రభావం కనబరుస్తుందన్న దానిపై రీసెర్చ్ చేశారు. చాట్ జీపీటీ యూజర్స్ సమస్యలను 60శాతం వేగంగా పరిష్కరిస్తున్నట్లు గుర్తించారు. అయితే వారి మేధా శక్తి, ఆలోచించే శక్తి మాత్రం 32 శాతానికి పడిపోయినట్లు తేల్చారు.
మసాచుసెట్స్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ శాస్త్రవేత్తలు.. మొత్తం 54 మందిపై పరిశోధనలు జరిపారు. 54 మందిపై ఈఈజీ బ్రెయిన్ స్కానింగ్ నిర్వహించారు. వీళ్లంతా 18 నుంచి 39 ఏళ్ల మధ్య వారు. దాదాపు 4నెలలు వీరిపై పరిశోధనలు చేశారు. రీసెర్చ్ లో భాగంగా ఆల్ఫా కిరణాలు, బీటా కిరణాలు, న్యూరో వ్యవస్థపై పరిశోధనలు నిర్వహించారు. అయితే చాట్ జీపీటీ వినియోగదారులకు మేధా శక్తి లోపించినట్లు తేలిందని వివరించారు. చాట్ జీపీటీ వినియోగదారుల న్యూరో వ్యవస్థ, భాషా సామర్థ్యం, వ్యవహరణలో మార్పులు గమనించినట్లు పేర్కొన్నారు.
చాట్ జీపీటీ వినియోగంతో అభివృద్ది చెందుతున్న మెదడు ప్రమాదంలో పడుతుందని ఈ పరిశోధనలను తన జర్నల్ లో వివరించిన నటాలియా కోస్మిన్ పేర్కొన్నారు. ఫలితాలు షాకింగ్ గా ఉన్నట్లు తెలిపారు. ఏఐ మనకు ఉపయోగ పడటం కాదని.. హరించి వేస్తోందని అభిప్రాయ పడ్డారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా కీలక విషయాలను వెల్లడించారు.చాట్ జీపీటీ లాంటి ఏఐ టూల్స్ కారణంగా మనిషి ఆలోచనా శక్తిని కోల్పోతున్నాడని.. కొత్తగా ఆవిష్కరించే గుణాన్ని కోల్పోతున్నాడని.. అన్నీ ఏఐ చేయడంతో మనిషి మెదడు యాక్టివ్ నెస్ తగ్గిపోతుందని.. ఓ రకంగా ఇది మనిషి మెదడుని తినేస్తుందని పరిశోధకులు అభిప్రాయపడ్డారు.
మనిషి మెదడుని తినేస్తున్న చాట్ జీపీటీ.. సంచలన రిపోర్టు వెలుగులోకి..?
RELATED ARTICLES