రుద్రంగి మండల కేంద్రంలో క్షుద్రపూజల ఆనవాళ్లు ప్రజలు ఆందోళన పడుతున్నారు..
మండల కేంద్రానికి చెందిన పిల్లమారపు గంగస్వామి అనే వ్యక్తికి చెందిన ఇంటి గడపలో బొట్టు, పసుపు, తాయిత్తు కట్టిన కొబ్బరికాయను గుర్తు తెలియని వ్యక్తులు వదిలి వెళ్ళారు దీంతో గంగస్వామి కుటుంబ సభ్యులు, చుట్టు పక్కలవారు భయాందోళనలకు గురైయ్యారు. గంగస్వామి భార్య మాట్లాడుతూ.. ఎవరో కావాలని క్షుద్రపూజలు చేసిన కొబ్బరికాయ, నిమ్మకాయలు మా ఇంటి ముందు వదిలి వెళ్ళారన్నారు.
గతంలో కూడా పలుమార్లు ఇలానే చేశారన్నారు. భయందోళనకు గురై ఇల్లు వదిలి వెళ్ళి కొరుట్ల పట్టణంలో నివాసముంటుండగా ఇటీవలే స్వంత ఇంటికి వచ్చామని, మళ్ళీ ఇలానే చేస్తున్నారని రోదిస్తూ తెలిపారు. గతంలో జరిగిన సంఘటనకు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని వాపోయారు. పైగా నీవే కావాలని చేస్తున్నావని గతంలో పని చేసిన ఎస్ఐ అన్నారని తెలిపారు. చివరికి ఇల్లు వదిలి వేరే చోట అద్దెకు ఉన్న అక్కడ కూడా అదే పరిస్థితి అని రోదిస్తూ తెలిపారు. తమ బాధను పట్టించుకొని సమస్యకు పరిష్కారం చూపాలని కోరారు.