వివాహేతర సంబంధాల విషయంలో తలెత్తే గొడవలు కొన్నిసార్లు ఆత్మహత్యలు, హత్యలకు దారి తీస్తుంటాయి. ఇలాంటి ఘటనలు నిత్యం మన కళ్ల ముందు ఎక్కడో చోట జరుగుతూనే ఉంటాయి.
తాజాగా, మధ్యప్రదేశ్‌లో దారుణ ఘటన చోటు చేసుకుంది. ఓ మహిళ భర్తను విడిచిపెట్టి మరో యువకుడితో ప్రేమాయణం సాగించింది. ఈ క్రమంలో ఇటీవల ఓ రోజురోడ్డుపై సడన్‌గా భార్య ప్రియుడు కంటపడ్డాడు. చివరకు ఏం జరిగిందో మీరే చూడండి..
మధ్యప్రదేశ్‌లోని (Madhya Pradesh) జబల్‌పూర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. స్థానిక ప్రాంతానికి చెందిన లఖు అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివాసం ఉంటున్నాడు. అయితే కొన్నాళ్లుగా ఈ దంపతుల మధ్య గొడవలు జరుగుతున్నాయి. దీంతో చాలా రోజుల నుంచి వారు విడివిడిగా ఉంటున్నారు. ఈ క్రమంలో లఖు భార్యకు ఇదే ప్రాంతానికి చెందిన రోహన్ అనే యువకుడితో పరిచయం ఏర్పడింది. ఈ పరిచయం కాస్తా వివాహేతర సంబంధానికి (extramarital affair) దారి తీసింది. తర్వాత ఇద్దరూ కలిసి జీవించడం ప్రారంభించారు. ఈ విషయం తెలుసుకున్న లఖు.. వారిపై కోపం పెంచుకున్నాడు. సమయం కోసం వేచి చూస్తూ ఉండేవాడు
ఈ క్రమంలో జనవరి 22న జబల్‌పూర్‌లోని హనుమంతల్ పోలీస్ స్టేషన్ పరిధి సింధీ క్యాంపు ప్రాంతంలో తన భార్య ప్రియుడు రోహన్ కనిపించాడు. అప్పటికే అక్కడ సిద్ధంగా ఉన్న తన ఇద్దరు స్నేహితులతో కలిసి రోహన్‌ను పట్టుకుని రోడ్డు పక్కకు తీసుకెళ్లారు. అక్కడ లఖు అతడిపై కత్తితో దాడి చేశాడు. పలుమార్లు బలంగా కడుపులో పొడవడంతో రోహన్ అక్కడికక్కడే చనిపోయాడు. ఈ ఘటనతో చుట్టూ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ అయ్యారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. లఖుతో పాటూ మరో అతని స్నేహితులలో ఒకరిని అరెస్ట్ చేశారు. కాగా, ఈ ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు షాకింగ్ కామెంట్లు చేస్తున్నారు.




