అతని అనుచరులు 9 మందిపై 420 చీటింగ్ కేసుతో పాటు ఎస్సీ ఎస్టీ
అట్రాసిటీ కేసు నమోదు అయిందని శామీర్పేట్ పోలీసులు తెలిపారు.
షామీర్పేట్ పోలీస్ ఇన్స్పెక్టర్ బాధితులు తెలిపిన వివరాల ప్రకారం మేడ్చల్
మల్కాజిరి జిల్లా మూడు చింతలపల్లి మండలంలోని కేశవరం గ్రామంలోని
సర్వేనెంబర్ 33 34 35లో గల 47 ఎకరాల 18 గంటల ఎస్టి (లంబాడీల)
వారసత్వ భూమిని మాజీ మంత్రి మేడ్చల్ బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే మల్లారెడ్డి
వారి బినామీ అనుచరులు 9 మంది అనుచరులు అక్రమంగా కబ్జా చేసి
కుట్రతో మోసగించి భూమిని కాజేసారని షామీర్పేట్ పోలీసేషన్లో ఫిర్యాదు
చేయగా విచారణ చేపట్టి న షామీర్పేట్ పోలీసులు మాజీ మంత్రి మేడ్చల్
ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి పై అతని అనుచరులు మాజీ మంత్రి
మల్లారెడ్డి బంధు వు శ్రీనివాస్ రెడ్డి కేశవాపూర్ గ్రామ మాజీ సర్పంచ్ బర్త
గోనె హరి మోహన్ రెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా (డిసిఏంఎస్)జిల్లా
సహకార సంఘం వైస్ చైర్మన్ షామీర్పేట మండల5 వ్యవసాయ సహకార
సేవ సంఘం వైస్ చైర్మన్ రామిడి మధుకర్ రెడ్డి శివుడు స్నేహ రామిరెడ్డి
,రామిడి లక్ష్మమ్మ, రామిడి నేహా రెడ్డి లపై షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో ఎస్సీ
ఎస్టీ అట్రాసిటీ 420 చీటీంగ్ కేసు నమోదు చేశామని షామీర్పేట్ పోలీసులు
తెలిపారు.. ఈ సందర్భంగా బాధితుడు కేతా వత్ బిక్షపతి నాయక్
మాట్లాడుతూ ఈ భూమి మా అమ్మ రాజీ గారి పేరు మీద మేడ్చల్ మల్కాజిరి
జిల్లా మూడు చింతలపల్లి మండలం కేశవరం గ్రామ పరిధిలోని సర్వేనెంబర్
33 34 35లో గల 47 ఎకరాల 18 భూమిమా పెద్దల నుండి మాకు
వారసత్వ హక్కుగా వచ్చిందన్నారు మా కుటుంబ సభ్యులు మరో ఆరు
మంది పేరున మొత్తం భూమి ఉందని అన్నారు. ఈ భూమిపై కన్నేసిన
స్థానిక ఎమ్మెల్యే మాజీ మంత్రి చామకూర మల్లారెడ్డి ఈ భూమిని ఎలాగైనా
కాజేయాలని కుట్రతో తన అనుచరులైన శ్రీనివాసరెడ్డి హరిమోహన్ రెడ్డి
మధుకర్ రెడ్డి శివుడు స్నేహరామిరెడ్డి రామిలి లక్ష్మమ్మ రామిడి నేహా రెడ్డిలు
మాకు మాయ మాటలు చెప్పి కుట్రతో మమ్మల్ని నమ్మించి మీ భూమి మీకు
వస్తుందని ఆశ చూపి మమ్మల్ని నమ్మించి అబద్ధాలు చెప్పి నిరక్షరాశులయిన
మా ఏడు మందితో 250 కోట్ల విలువ చేసే భూమిని పీటీ సరెండర్
చేయించారని పేర్కొన్నారు మా భూమిపై మేము హక్కులు కోల్పోయేలా చేసి
ఎస్టీ లంబాడీలమైన మాపై అట్రాసిటీ పాల్పడినారని, ఆరోజు మాకు ఏడు
మందికి ఒక్కొక్కరికి మూడు లక్షల చొప్పున డబ్బు ఇచ్చారని, మీడియాకు తెలిపారు
తాసిల్దార్ వాణిరెడ్డిపై కేసు నమోదు చేయాలి
అధికార పార్టీ అండతో మంత్రిగా అధికార దుర్వినియోగానికి పాల్పడిన మాజీ మంత్రి మల్లారెడ్డి ఆదేశాలతో రాత్రి 11 గంటలకు షామీర్పేట్ తహసిల్దార్ కార్యాలయంలో తాసిల్దార్, సబ్ రిజిస్టర్ వాణి రెడ్డి అక్రమంగా 47.18 ఎకరాల భూమి నీ మాజీ మంత్రి అనుచరులపై రిజిస్టర్ చేశారని వారు ఆరోపించారు. తాసిల్దార్ వాణి రెడ్డి రిజిస్ట్రేషన్ చేసే సమయంలో మాకు ఎలాంటి సమాచారం చెప్పకుండా అప్పటి మల్లారెడ్డి డబ్బు సంచులకు కక్కుర్తి పడి మాభూమిని మల్లారెడ్డికి దార దత్తం చేసిందని తాసిల్దార్ వాణి రెడ్డి పై దుమ్మెత్తి పోశారు భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసి 20 లక్షలకు అమ్ముడు పోయిందని వారు ఆరోపించారు. మా భూమిని అక్రమంగా రిజిస్ట్రేషన్ చేసిన మూడు చింతల పల్లి తాసిల్దార్ వాణి రెడ్డి పై కాంగ్రెస్ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి క్రిమినల్ కేసులు నమోదు చేయాలని బాధితులు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి గారు ఈ భూమి అక్రమ కుట్ర అక్రమకబ్జాపై సమగ్ర విచారణ చేపట్టాలి.
అయ్యా సీఎం రేవంత్ రెడ్డి గారు మేము ఎస్టి లంబాడి కులానికి చెందిన నిరుపేదలం మా భూమిని గత తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో రాష్ట్ర కార్మిక శాఖ మంత్రిగా ఉన్న చామకూర మల్లారెడ్డి అతని బినామీ అనుచరులు 9 మంది బి ఆర్ఎస్ పార్టీ నాయకులు మా భూమి పై కుట్ర చేసి మాకు తెలియకుండానే 250 కోట్ల విలువ చేసే 47 ఎకరాల 18 గుంటల మా భూమిని అక్రమంగా అర్థరాత్రి రిజిస్ట్రేషన్ చేసుకొని మోసం చేసిన మాజీ మంత్రి ప్రస్తుత ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి అతని పార్టీ అనుచరులు 9 మందిపై తెలంగాణ ప్రభుత్వం సమగ్ర విచారణ చేపట్టి కుట్రతో భూమిని కాజేసిన 9 మంది పై జ్యుడీషియల్ విచారణ చేపట్టి మా భూమిని మాకు అప్పగించాలని బాధితుడు కేతావత్ బిక్షపతి వారి కుటుంబ సభ్యులు తెలంగాణ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి మీడియా ముఖంగా విన్నవించారు. ఈ అక్రమ భూకబ్జా తతంగంపై రాష్ట్ర ముఖ్యమంత్రి పిర్యాదు చేశారు..





