spot_img
Tuesday, July 22, 2025
spot_img

మీ ఫోన్ పోయిందా ? అయితే అందులో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్‌పే అకౌంట్లను ఎలా బ్లాక్ చేయాలో తెలుసుకోండి..!

ఫోన్ పోవడం అనేది సహజంగానే జరుగుతుంటుంది. మన అజాగ్రత్త వల్ల లేదంటే మనం ఏమరుపాటుగా ఉన్నప్పుడు దొంగలు కొట్టేయడం వల్ల.. ఫోన్లు పోతుంటాయి. ఈ క్రమంలో అందులో ఉండే డేటా గురించే మనకు బెంగ పట్టుకుంటుంది.ముఖ్యంగా యూపీఐ యాప్‌ల గురించి భయం చెందుతారు. వాటిని ఓపెన్ చేసి అకౌంట్ల ద్వారా డబ్బులను దొంగిలిస్తే ఎలా ? అని దిగులు పడతారు. అయితే కింద తెలిపిన స్టెప్స్ ను పాటిస్తే మీ ఫోన్‌లో ఉండే పేటీఎం, గూగుల్ పే, ఫోన్ పే అకౌంట్లను సులభంగా బ్లాక్ చేయవచ్చు. మరి ఆ స్టెప్స్ ఏమిటంటే..

గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటే..

స్టెప్ 1: ఫోన్ పోయిన వెంటనే వేరే నంబర్ నుంచి 18004190157 అనే హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలి.

స్టెప్ 2: కస్టమర్ సర్వీస్ ఎగ్జిక్యూటివ్‌తో మాట్లాడే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయమని చెప్పాలి.

స్టెప్ 3: ఆండ్రాయిడ్ యూజర్లు అయితే ఫైండ్ మై ఫోన్ ద్వారా గూగుల్ అకౌంట్‌లోని డేటాను రిమోట్ వైప్ చేయవచ్చు. దీంతో ఫోన్‌లోని డేటా డిలీట్ అవుతుంది. ఇలా గూగుల్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయవచ్చు.

పేటీఎం అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటే ?

స్టెప్ 1: పేటీఎం పేమెంట్స్ బ్యాంక్ హెల్ప్ లైన్ నంబర్ 01204456456 కు కాల్ చేయాలి.

స్టెప్ 2 : లాస్ట్ ఫోన్ అనే ఆప్షన్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 3: ఆల్టర్‌నేటివ్ నంబర్‌ను ఎంటర్ చేసే ఆప్షన్‌ను ఎంచుకోవాలి. పోయిన ఫోన్ నంబర్‌ను ఎంటర్ చేయాలి.

స్టెప్ 4: పేటీఎం వెబ్‌సైట్‌ను సందర్శించి అందులో ఉండే 24×7 help ను ఎంచుకోవాలి. అక్కడ ఉండే రిపోర్ట్ ఫ్రాడ్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 5: మెసేజ్ అస్ అనే బటన్‌పై క్లిక్ చేయగానే ఓనర్‌షిప్ ప్రూఫ్ అడుగుతుంది. అక్కడ పేటీఎం లావాదేవీలను చూపే స్టేట్ మెంట్ ను ఇవ్వాలి. పోయిన ఫోన్ గురించి పోలీసులకు ఇచ్చిన కంప్లెయింట్‌ను చూపాలి. లేదా సంబంధిత పత్రాలను చూపాలి.

స్టెప్ 6: వెరిఫికేషన్ అనంతరం మీ పేటీఎం అకౌంట్‌ను బ్లాక్ చేస్తారు.

ఫోన్ పే అకౌంట్‌ను బ్లాక్ చేయాలంటే ?

స్టెప్ 1: ఫోన్‌పే వినియోగదారులు 08068727374 అనే హెల్ప్ లైన్ నంబర్‌కు కాల్ చేయాలి.

స్టెప్ 2: మీ ఫోన్‌పే అకౌంట్‌లో ఏదైనా సమస్య ఉంటే రిపోర్టు చేయమని అడుగుతారు. అక్కడ సరైన ఆప్షన్ నంబర్‌ను ఎంచుకోవాలి.

స్టెప్ 3: రిజిస్టర్డ్ మొబైల్ నంబర్‌ను, ఓటీపీని వెరిఫికేషన్ కోసం ఎంటర్ చేయాలి.

స్టెప్ 4: ఓటీపీ పొందే సదుపాయం లేదని ఆప్షన్‌ను ఎంచుకోవచ్చు. అక్కడ సిమ్ కార్డు పోయిందని ఆప్షన్ ను ఎంచుకోవచ్చు.

స్టెప్ 5: ఈ విధానాన్ని అనుసరించాక బ్లాక్ ది అకౌంట్ అనే రిక్వెస్ట్‌ను ప్రారంభిస్తారు. దీంతో అకౌంట్ బ్లాక్ అవుతుంది.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular