వర్కు లో బిజీ బిజీ గా ఉండే టెక్కీ లని టార్గెట్ చేశారు క్రిమినల్స్..ఏదో రకంగా నమ్మించి భయపెట్టి వారి వద్ద నుండి డబ్బులు వసూలు చేస్తున్నారు ..ఇలాగే ఓక ఘటన జరిగింది..ముంబై పోలీసులమని నమ్మించి వ్యక్తి నుంచి రూ. 1.52 కోట్లను వసూలు చేసిన ఘటన బెంగళూరు మైకోలేఔట్ పోలీసుస్టేషన్ పరిధిలో జరిగింది.
మైకో లేఔట్‌కు చెందిన ఒక టెక్కీకి నవంబర్ 10న కార్తికేయన్ పేరుతో ఓ వ్యక్తి ఫోన్ చేశాడు. నీ పేరుతో డ్రగ్స్ కొరియర్ అవుతున్నాయి. విమానాశ్రయం కస్టమ్స్ అధికారులు ఆ డ్రగ్స్‌ను సీజ్ చేశారు, నీపై కేసు నమోదైందని బెదిరించాడు. బాధితుడు భయపడి కొరియర్‌కు- తనకు ఎలాంటి సంబంధం లేదంటూ చెప్పడంతో ఫోన్ కట్ చేశాడు.
ముంబై పోలీసులమని..
మళ్లీ కొంతసేపటి తరువాత మరో వ్యక్తి ముంబై సైబర్ క్రైం పోలీసుల పేరుతో కాల్ చేశాడు. ఆ కొరియర్ మీది కాకుంటే మీ ఆధార్, పాన్, బ్యాంకు వివరాలను ఇవ్వు, లేదంటే డ్రగ్స్ కేసు పెట్టి జైలుకు పంపుతామని బెదిరించాడు. కేసు పెట్టరాదంటే డబ్బు పంపాలని చెప్పాడు, భయాందోళనకు గురైన బాధితుడు పలు విడతలుగా రూ.1.52 కోట్లను అపరిచిత వ్యక్తి ఖాతాలోకి జమ చేశాడు. మళ్లీ డబ్బులు కావాలని డిమాండ్ చేయడంతో బాధిత వ్యక్తి బెంగళూరు సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేశాడు.