spot_img
Wednesday, March 25, 2026
spot_img

ముఖ్యమంత్రి గారు హోమ్ మినిస్టర్ అపాయింట్ చేయండి సార్ సిస్టం దెబ్బతింటుంది

కెసిఆర్ గవర్నమెంట్ లో రాజకీయ నాయకులు ఏం చెప్తే అది చేశారంటూ పోలీసుల మీద ఆరోపణలు వచ్చాయి భూ కబ్జాల విషయంలో అలాగే పోలీస్ స్టేషన్లో పోస్టింగ్ విషయంలో తమ ఏరియాల్లో తమకు అనుకూల వారికి పోస్టింగ్ ఇస్తూ ఇష్టను రాజ్యాంగ వ్యవహరించారంటూ అనేకమైన ఆరోపణలు వచ్చాయి 10 సంవత్సరాల తర్వాత అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి గవర్నమెంట్ లో తమకు న్యాయం జరుగుతుంది అని ప్రజలు ఎంత ఆశగాన ఎదురుచూస్తున్నారు పోలీసులు మార్పులు చేర్పులు జరిగాయి కింది స్థాయి పోలీసులు సస్పెండ్ చేయడంలో ఉన్న ఆసక్తి సమస్యల పరిష్కారం లేదని మాత్రం ఇప్పుడు జరుగుతున్న తీరు పోలీస్ కమిషనరేట్ పరిధిలో కొత్తవారు వచ్చారు కానీ ఓ కమిషనర్ ఒక అమ్మాయి విషయంలో వెళ్లి అడిగితే సదరు జర్నలిస్ట్ ని నిలబెట్టి అయితే ఏం చేద్దాం? చేసేదేం లేదు అమ్మాయి బతుకుందో లేదో చూసుకోండి అంటూ చెప్పడం వెనుక ఆయన నిర్లక్ష్య సమాధానం తెలుస్తోంది ఈయన ఎందుకు మానవత్వం లేకుండా ఈ రకంగా మాట్లాడాడు అర్థం కావడం లేదు కిందిస్థాయి ఉద్యోగులను సస్పెండ్ చేయడంలో ఉన్న ఆసక్తి సమస్యను పరిష్కరించడం లేదని స్పష్టంగా అర్థం అవుతుంది ఆయన మార్క్ కనిపించాలంటూ కమిషన్ పరిధిలో కొత్త కొత్త మార్పులు తీసుకొచ్చి సామాన్యుడు లోపలికి వెళ్లాలంటే అనేకమైన రెస్ట్రిక్షన్స్ పెట్టి తన బ్రాండ్ ఇమేజ్ అంటూ చెప్పే ప్రయత్నం చేశారు ప్రజలను సమస్యలు పరిష్కరించాలా లేదా తనను కలవాలి అంటే కచ్చితంగా రూల్స్ పాటించాలి అంటూ కొత్త పద్ధతులు అవసరమా అంటూ సామాన్యులు గోనుక్కున్న పరిస్థితి ఓ విషయంలో డీజీపీ గారిని కలిసిన అదే జర్నలిస్టుకు అదే రకమైన అవమానం జరిగింది. ఆయన దగ్గర న్యాయం జరగపోవడంతో సదరు జర్నలిస్ట్ సీతక్క గారి దగ్గరనుంచి ఫోన్ చేయించుకుని మరీ వెళ్తే సదరు డిజిపి గారు కూడా ఆయనను నిలబెట్టి నిర్లక్ష్యంగా ఎంక్వయిరీ చేస్తాం పో అన్న మాటలు చాలా ఇబ్బందిగా అనిపించాయి అన్నీ తెలిసిన అందరితో మాట్లాడగలిగిన సోర్స్ ఉన్న జర్నలిస్టుకు ఇలాంటి అవమానం జరగడం అది ఒక లేడీ డైనమిక్ మినిస్టర్ చెప్పిన అయితే ఏంటంటే ఆయన సమాధానం కచ్చితంగా ఇబ్బందికర పరిస్థితి దీనికి అంతటికి హోమ్ మినిస్టర్ ఒకరు ఉంటే కచ్చితంగా ప్రజలు ఎన్నుకున్న నాయకుడు ద్వారా సదరు యంత్రాంగం కంట్రోల్ లో ఉంటుంది సదరు యంత్రాంగం కు ప్రజా నాయకుడు బాస్ గా లేకపోవడంతో ఇవన్నీ జరుగుతున్న పరిణామాలు ముఖ్యమంత్రి డైరెక్ట్ గా కలవలేదు కలిసి అవకాశం లేదు మరి మినిస్ట్రీని కలిస్తే మినిస్టర్లను లెక్కచేయని పోలీసు యంత్రాంగం మరి ఎవరిని కలవాలి కలిస్తే ఏ రకంగా న్యాయం జరుగుతుంది అందుకే రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా హోం మినిస్టర్ ను నియమించి యంత్రంగాన్ని కంట్రోల్ చేయకపోతే ప్రజల ఇబ్బందులు చాలా దారుణంగా ఉంటాయి. గత ప్రభుత్వం చేసిన తప్పిదాలను మీరు చేస్తున్నారంటూ మీ మీద దాడికి వచ్చే అవకాశం కూడా ఉంది ఎంతో నమ్మకంతో రేవంత్ రెడ్డి గారిని గెలిపించిన గతంలో యంత్రాంగం ఏరకంగా ప్రజలకు వ్యతిరేకంగా ఉందో ఇప్పుడు కూడా అదే రకంగా ఉంది పోలీసు యంత్రాంగం(అందరూ కమిషనర్ లు కాదు అందరూ పోలిస్ లు కాదు ) అని భావించే అవకాశం ఉంది అందరూ ఇలా చేస్తున్నారని చెప్పటం ఉద్దేశం కాదు చేస్తున్న వారి వల్ల జరిగే డ్యామేజ్ ప్రభుత్వం మీద అపవాది పడే అవకాశం ఉంది సదరు DGP బిజినెస్ మాన్ కు బ్యూరో కార్డ్స్ కు ఇచ్చిన వాల్యూ సామాన్యులకు ఇవ్వడం లేదన్నది ఇక్కడ జరుగుతున్న చర్చ అటు మినిస్ట్రీని లెక్కచేయక ఇటు సామాన్యులకు పనిచేయని వ్యవస్థ ఎందుకు అని ప్రజలు బాధపడి అది ప్రతిపక్షాల దగ్గరికి వెళ్లి ఆందోళన తీవ్రతరమై ఇబ్బంది పడే స్థాయికి వెళ్ళకముందే మీరు ఒక హోమ్ మినిస్టర్ చేస్తే ఖచ్చితంగా ఒక హోమ్ మినిస్టర్ గా ప్రజా నాయకుడిగా ఆయన చెప్పిన మాటలు వినాలి కాబట్టి ఖచ్చితంగా ప్రజలకు న్యాయం జరుగుతుంది ఇప్పటికైనా సరే హోమ్ మినిస్టర్ ని కనుక అపాయింట్ చేయకపోతే వ్యవస్థలో కొంతమంది మాత్రమే మేము అందరూ మీ అనడం లేదు వ్యవస్థలో కొంతమంది తమ ఈగోలు చూపించుకుంటూ అధికారం పై తమ జూలు0 ప్రదర్శిస్తూ ఈ రకంగా సామాన్యులను ఇబ్బంది పెడుతున్న వ్యవస్థను కంట్రోల్ చేయాల్సింది రేవంత్ రెడ్డి గారు కాబట్టి ఖచ్చితంగా హోమ్ మినిస్టర్ గారిని అపాయింట్ చేస్తే అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది కొత్త ప్రభుత్వం ప్రజా ప్రభుత్వం అని నిరూపితం అవుతుందని తెలుస్తుంది

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular