ఫైనాన్స్ సంస్థల్లో బంగారం తాకట్టు పెట్టేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే బ్యాంకు అధికారులు కూడా కొన్ని చోట్ల మోసాలకు పాల్పడుతున్నారు.
కస్టమర్లు తాకట్టు పెట్టిని బంగారానికి బదులు నకిలీ బంగారాన్ని పెట్టి ఇస్తున్నారంట బ్యాంకు సిబ్బంది. లేటెస్ట్ ఇలాంటి ఘటన ఆంధ్రప్రదేశ్ పల్నాడు జిల్లా సత్తెనపల్లి ముత్తూట్ మినీ ఫైనాన్స్ సంస్థలో జరిగింది.
బ్యాంకు అధికారుల గోల్డ్ ఆడిటింగ్ లో ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది ఈ ఘటన. తాకట్టు బంగారం మోసంపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేయగా… బంగారు ఆభరణాల స్థానంలో ముత్తూట్ మినీ ఫైనాన్స్ సంస్థ సిబ్బంది నకిలీ బంగారం పెట్టినట్టు గుర్తించారు. భాధితుడు శివనాగ బ్రహ్మచారి ఫిర్యాదు మేరకు మేనేజరు గోల్డ్ అప్రైజర్ పై కేసు నమోదు చేశారు పోలీసులు.