ములుగు జిల్లా ఏటూరు నాగారం మండలం కు చెందిన బెజ్జంకి రాజేష్ (24 సంవత్సరాలు) మంగపేట మండలం కమలాపురం కు చెందిన మాదరి శిరీష (22 సంవత్సరాలు) అనే యువతి,యువకుడు సంవత్సరం నుండి ప్రేమించుకుంటున్నారు.ప్రేమ పెళ్లికి పెద్దలు ఒప్పుకున్నారు.కాకపోతే అబ్బాయి తండ్రి 3 సంవత్సరాల తర్వాత పెళ్లి చేద్దామని చెప్పగా అమ్మాయి తండ్రి మాత్రం 6 నెలల్లో పెళ్లి చేయాలని చెప్పాడు.
విషయం తెలుసుకున్న ప్రేమ జంట పెళ్లి చేస్తారో చేయరో అని మనస్తాపానికి గురై మంగపేట మండలం మల్లూరు గుట్ట పై ఎక్కి పురుగుల మందు తాగి కుటుంబ సభ్యులకు విషయం తెలిపారు.విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకుని ఇద్దరినీ ఏటూరునాగారం లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరిస్థితి విషమించడంతో ఇద్దరిని వైద్యం నిమిత్తం వరంగల్ ఎంజీఎం ఆస్పత్రికి తరలించారు.