spot_img
Sunday, July 20, 2025
spot_img

మోదీ ఎంత ఎంత పెరిగిందో తెలుసా? రాత్రికి రాత్రి గ్రాఫ్ ఎక్కడికో పెరిగింది

ఆపరేషన్ సిందూర్ తో పాక్ కు జరిగిన నష్టం గురించి మనకు తెలియదు. నష్టమయితే జరిగింది. అలాగే ఉగ్రవాదులకు కూడా భారీ నష్టం జరిగిందని మాత్రం ఖచ్చితంగా చెప్పొచ్చు.కానీ సిందూర్ మాత్రం మోదీ ఇమేజ్ గ్రాఫ్ దేశంలోనే కాదు ప్రపంచలోనే ఒక్కసారిగా పెరిగిందన్నది అందరూ ఒప్పుకునే వాస్తవం. ఆపరేషన్ సిందూర్ తో ప్రధాని నరేంద్ర మోదీ దేశంలో శక్తిమంతమైన నేతగా ఆవిర్భవించారు.ఎందుకంటే ప్రత్యర్థులు విమర్శించవచ్చు. ఎన్నికలకు ముందు యుద్ధం అంటూ హడావిడి చేసి సెంటిమెంట్ రగిలించే ప్రయత్నం అనే వాళ్లకు కూడా మోదీ సమాధానం ధీటుగా చెప్పారు. ఇప్పుడిప్పుడే ఎన్నికలు లేవు. అయినా ఈ ఉద్రిక్తతలు భారత్ కొని తెచ్చుకుంది కాదు. పహాల్గామ్ లో ఉగ్రవాదులు దాడి చేసి ఇరవై ఆరు మంది అమాయకులను పొట్టన పెట్టుకోవడంతో భారత్ రగలిపోయింది.

కన్నెత్తి చూడకుండా…ప్రతి భారతీయుడు పాక్ పై కసి తీర్చుకోవాలని కోరుకున్నాడు. కానీ పాక్ కానీ, ఉగ్రవాదులు కానీ తక్కువ అంచనా వేశారు. అక్కడ ఉన్నది మోదీ. ప్లాన్ చేశాడంటే ఇక తిరుగుండదు. ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఎలాంటి చర్చ నడుస్తుందంటే.. భారత్ – పాక్ ల మధ్య యుద్ధం కాదిది. తీవ్రవాదులు వర్సెస్ మోదీ మధ్యనే అన్నది అందరికీ అర్థమయ్యేలా చెప్పగలిగారు. దీంతో పాటు భారత సత్తాను అంతర్జాతీయ సమాజం ముందు మోదీ ఉంచగలిగారు. మరొకరు భారత్ పై కన్నెత్తకుండా ఈ ఒక్క ప్రయత్నంతో చేశారు. భారత్ కు జరిగిన నష్టం స్వల్పమే. కానీ పాక్ మాత్రం ఉగ్రవాదులను ప్రోత్సహించి ఈరోజు భారీ మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇటు టెర్రరిస్టుల గ్యాంగ్ కూడా వంద మందికి పైగానే హతమయ్యారంటున్నారు.ఉగ్రవాదులకు కోలుకోలేని దెబ్బ…ఇది నిజంగా మోదీ టెర్రరిస్టులను కోలుకోలేని విధంగా దెబ్బతీసినట్లే. మన భూభాగం పై నుంచి తొమ్మిది ఉగ్రవాద మూకల స్థావరాలను నాశనం చేయగలిగారంటే ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశారో అర్థమవుతుంది. కేవలం పదిహేను రోజుల్లోనే ఉగ్రవాదులు వారికి అండగా నిలుస్తున్న పాక్ కు గుణపాఠం మోదీ చెప్పగలిగారు. ఉగ్రవాదులు కూడా భారత్ ఆర్మీపైన ఆగ్రహంగా లేరు. కేవలం మోదీనే లక్ష్యంగా చేసుకునే అవకాశముందన్న వార్తలు వస్తున్నాయి. కరడు గట్టిన తీవ్రవాది జైషే మహ్మద్ మసూద్ అజహర్ సయితం మోదీపై విషం కక్కే ప్రయత్నం చేశాడు. ఈ దాడుల్లో మసూద్ కుటుంబ సభ్యులను దాదాపు పథ్నాలుగు మందిని కోల్పోయారు. సహచర ఉగ్రవాదులు హతమయ్యారుమోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం…గతంలో పాక్ పై యుద్ధం ప్రకటించిన ఇందిర గాంధీ ఐరన్ లేడీగా నిలిచారు. నేడు మోదీ కూడా పాక్ పీచమణచడానికి వేసిన ప్లాన్ సక్సెస్ అయిందనే చెప్పాలి. ఆపరేష్ సిందూర్ అని పేరు పెట్టడం నుంచి మహిళ అధికారుల చేత మీడియా సమావేశం పెట్టి దాడులపై బ్రీఫింగ్ ఇప్పించడం దగ్గర నుంచి మోదీ తీసుకున్న ప్రతి నిర్ణయం హైలెట్ అయిందనే చెప్పాలి. ప్రతి భారతీయుడు మరచిపోలేని విధంగా మోదీ వ్యవహరించారని సోషల్ మీడియాలో మారుమోగిపోతుంది. ఎన్నికల కోసం కాదు కానీ.. మోదీ ఉంటే భరోసా ఉంటుందన్న నమ్మకాన్ని అందరిలో కలిగించారు. విమర్శకుల నోళ్లు సయితం మూయించగలిగారు. అందుకే ఆపరేషన్ సింధూర్ లాభనష్టాలపై అంచనాలకంటే మోదీ ఇమేజ్ మాత్రం అమాంతం పెరిగిందన్నది విశ్లేషకులు సయితం అంగీకరిస్తున్న విషయం. కాల్పుల విరమణ తర్వాత మోదీ ఇమేజ్ పడిపోయిందని కొందరు అంటున్నప్పటికీ.. యుద్ధం అన్నింటికీ సమాధానం కాదని, పహాల్గామ్ పై దాడికి ప్రతీకారం తీర్చుకోగలిగామన్న కామెంట్స్ మాత్రం వినపడుతున్నాయి.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular