గుర్తుతెలియని యువతిని హత్యచేసి కాల్చివేసిన ఘటన మెదక్ జిల్లా చేగుంట మండలం వడియారం సమీపంలో ప్రధాన రహదారి పక్కన వెలుగుచూసింది.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..సుమారు 25 ఏళ్ల వయసు ఉన్న గుర్తుతెలియని యువతి మృతదేహం హైదరాబాద్‌కు వెళ్లే రహదారి పక్కన సగం కాలిపోయిన స్థితిలో ఉంది. విషయం తెలిసిన పోలీసులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. దుండగులు ఆమెను ఎక్కడో హత్యచేసి ఇక్కడికి తీసుకొచ్చి పెట్రోలు పోసి నిప్పటించినట్లు అక్కడ ఉన్న ఆనవాళ్లను బట్టి తెలుస్తోందని ఎస్సై తెలిపారు.
మృతురాలి ఒంటిపై కాషాయ రంగు టాప్, ఎరుపు లెగ్గిన్ ఉందని పేర్కొన్నారు. మృతురాలి గుర్తు తెలిసిన వ్యక్తులు, సంబంధిత బంధువులు ఎవరైనా ఉంటే చేగుంట పోలీసుస్టేషన్, రామాయంపేట సర్కిల్ కార్యాలయంలో సంప్రదించాలని తెలిపారు.