అసెంబ్లీ డిప్యూటీ స్పీకర్ గా ఉన్న టీడీపీ ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు సంబంధించిన ఓ పాత కేసులో ఇవాళ కీలక పరిణామం చోటు చేసుకుంది. రఘురామకృష్ణంరాజు వైసీపీ రెబెల్ ఎంపీగా ఉండగా..హైదరాబాద్ లోని ఆయన ఇంటి వద్ద పోలీసులతో నిఘా పెట్టించారు. ఇలా నిఘా కోసం వెళ్లిన ఓ కానిస్టేబుల్ ను బంధించి కొట్టారంటూ రఘురామతో పాటు ఆయన కుమారుడు భరత్ పై గతంలో కేసు నమోదైంది. ఈ కేసులో ఇవాళ సుప్రీంకోర్టులో విచారణ సందర్భంగా ట్విస్ట్ ఎదురైంది.హైదరాబాద్ గచ్చిబౌలిలోని రఘురామరాజు ఇంటి వద్ద నిఘా కోసం అప్పటి వైసీపీ ప్రభుత్వం నిఘా కోసం కానిస్టేబుళ్లను పంపింది. అయితే ఇందులో ఫరూక్ బాషా అనే కానిస్టేబుల్ ఇలా నిఘాకు ప్రయత్నిస్తుండగా.. ఆయన్ను పట్టుకుని రఘురామ, ఆయన కుమారుడు భరత్ దాడి చేసినట్లు గచ్చిబౌలి పోలీసులు కేసు నమోదు చేసారు. వాస్తవానికి తాము ఆయనపై దాడి చేయలేదని వారు అప్పట్లో ఆరోపించారు. తమ ఇంటి వద్ద నిఘా పెట్టారని ఇచ్చిన ఫిర్యాదును పట్టించుకోకుండా నిఘా కోసం వచ్చిన కానిస్టేబుల్ ను కొట్టారని కేసు నమోదు చేయడంపై రఘురామ తీవ్ర అభ్యంతరం తెలిపారు.అయితే అప్పట్లో వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండటంతో ఈ వ్యవహారంపై రఘురామ హైకోర్టును ఆశ్రయించారు. అయితే హైకోర్టు రఘురామ పిటిషన్ ను తోసిపుచ్చింది. దీనిపై ఆ తర్వాత ఆయన సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. సుప్రీంకోర్టులో జస్టిస్ జేకే మహేశ్వరి, జస్టిస్ విజయ్ బిష్ణోయ్ బెంచ్ ఈ పిటిషన్ ను విచారించింది. అదే సమయంలో ఫిర్యాదుదారుగా ఉన్న కానిస్టేబుల్ ఫరూక్ బాషా ఈ కేసును తాను ఇకపై కొనసాగించదల్చుకోలేదని తెలిపారు.దీనిపై స్పందించిన సుప్రీంకోర్టు ఆ మేరకు అఫిడవిట్ దాఖలు చేయాలని సూచించింది. అలాగే రఘురామ లాయర్ ను సైతం అప్పట్లో చోటు చేసుకున్న పరిణామాలపై పూర్తి వివరాలు సమర్పించాలని ఆదేశించింది. దీంతో రెండు వారాల తర్వాత జరిగే తదుపరి విచారణలో రఘురామకు ఊరట కల్పించే విషయంలో సుప్రీంకోర్టు తుది నిర్ణయం తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రఘురామ కేసులో బిగ్ ట్విస్ట్..! సుప్రీంలో కానిస్టేబుల్ యూటర్న్..!
RELATED ARTICLES