spot_img
Monday, March 23, 2026
spot_img

రష్మిక డీప్ ఫేక్..దొంగ దొరికాడు!

సెలబ్రెటీలను కలవరపెడుతున్న దీప్ ఫేక్ సంగతి తెలిసిందే. సినీ నటుల దగ్గరి నుండి రాజకీయ నాయకుల వరకు ఫేక్ వీడియోలు సృష్టిస్తూ అందరిని భయాందోళనకు గురి చేస్తున్నారు.

ప్రధానమంత్రి నరేంద్రమోడీ డీప్‌ ఫేక్ సైతం సృష్టించారంటే కేటుగాళ్లు ఎంతకు తెగించారో అర్థం చేసుకోవచ్చు.

రీసెంట్‌గా హీరోయిన్‌ రష్మికకు సంబంధించిన ఓ ఫేక్‌ వీడియో సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. సినిమా ఇండస్ట్రీకి చెందిన ఎంతో మంది రష్మికకు మద్ధతు నిలిచారు.దీనిపై విచారణ చేపట్టగా పోలీసులు కేసు నమోదు చేసి విచారణ కూడా ప్రారంభించారు.

తాజాగా ఈ కేసును చేధించారు పోలీసులు. రష్మిక డీప్ ఫేక్ వీడియో సృష్టించిన ప్రధాన నిందితుడి నవీన్‌ని అదుపులోకి తీసుకున్నారు ఢిల్లీ పోలీసులు. నవీన్‌ ఆంధ్రప్రదేశ్‌లోని గుంటూరుకు చెందిన వ్యక్తి అని, నిందితుడి నుంచి ల్యాప్‌టాప్, మొబైల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ కేసుకు సంబంధించిన విచారణ జరుగుతోందని తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

spot_img
- Advertisment -spot_img

Most Popular