
సెక్రటరీ–ప్రెసిడెంట్ గుట్టు, డబుల్ రిజిస్ట్రేషన్ మాయ, ‘కంత్రి జర్నలిస్టు’ కథ బయటకు!**
మైలర్ దేవులపల్లి TNGO కాలనీ మెగా స్కాం – 100 ఎకరాలు, 100 కోట్ల అక్రమ దందా!
సెక్రటరీ–ప్రెసిడెంట్ గుట్టు, డబుల్ రిజిస్ట్రేషన్ మాయ, ‘కంత్రి జర్నలిస్టు’ కథ బయటకు!*మైలర్ దేవులపల్లి TNGO కాలనీ వ్యవహారం ఇప్పుడు తెలంగాణలో సంచలనంగా మారుతోంది.
156/1 సర్వే నెంబర్‌లో సుమారు 100 ఎకరాల భూమి, 999 ప్లాట్లు, ఒక్కొక్కరికి 300 గజాల చొప్పున కేటాయించాల్సిన ఈ కాలనీలో భారీ అక్రమాలు జరిగినట్టు కోబ్రా న్యూస్‌కు కీలక సమాచారం లభించింది.
నోటిఫికేషన్ ద్వారా మాత్రమే, తెలంగాణ సచివాలయ ఉద్యోగులకే ఇవ్వాల్సిన భూమిని నిబంధనలకు విరుద్ధంగా RTC, పోలీస్ విభాగాలకు కాకుండా సెక్రటేరియట్ ఉద్యోగులకు మాత్రమే ఇవ్వాల్సిన ల్యాండ్ ను సంబంధం లేని వ్యక్తులకు అప్పనంగా కేటాయించినట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ మొత్తం వ్యవహారం వెనుక కాలనీ సెక్రటరీ, ప్రెసిడెంట్ కీలక పాత్ర పోషించినట్టు తెలుస్తోంది.
డబుల్ రిజిస్ట్రేషన్‌తో మరో స్కాం
ఇటీవల ఇదే కాలనీలో డబుల్ రిజిస్ట్రేషన్ ద్వారా మరో భారీ మోసం జరిగినట్టు సమాచారం. ఒకే ప్లాట్‌ను ఇద్దరు, ముగ్గురికి రిజిస్ట్రేషన్ చేయడం ద్వారా కోట్ల రూపాయల అక్రమ లావాదేవీలు జరిగినట్టు బాధితులు ఆరోపిస్తున్నారు.
రాజకీయ అండతో రెచ్చిపోయిన అక్రమ దందాలు?
స్థానికంగా ఒక MLA అండతో అక్రమాలు నిర్భయంగా కొనసాగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇదే అండతో ఒక కంత్రి జర్నలిస్టు మరొకరి భూమిని కబ్జా చేసి, నేరుగా ఇల్లు నిర్మించిన ఘటన కూడా వెలుగులోకి వచ్చింది.
జర్నలిజం ముసుగులో దందా?
బయటకు నైతికత, ల్యాండ్ సెంటిమెంట్ మాటలు చెబుతూ, లోపల మాత్రం
వాయిస్ రికార్డింగ్‌లు
బెదిరింపులు
వ్యక్తిగత లాబీయింగ్
మీడియా పరిచయాలతో అడ్డంకులను తొలగించుకోవడం
వంటి పద్ధతుల్లో అక్రమ సంపాదన చేసినట్టు కోబ్రా న్యూస్‌కు ఆడియో సాక్ష్యాలు లభించాయి.
ఒకప్పుడు పెద్ద ఛానల్‌లో పనిచేసిన సమయంలో కూడా ఇదే తరహా ఆరోపణలు ఎదుర్కొన్న సదరు వ్యక్తి, ఇప్పుడు మళ్లీ మరో పెద్ద ఛానల్‌లో అవకాశం దక్కించుకుని అదే దందాను పునరావృతం చేస్తున్నాడా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
హెచ్చరిక స్పష్టం :–
ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తులు స్పందించకపోతే,
👉 ఆడియో, వీడియో సాక్ష్యాలతో కూడిన పూర్తి వివరాలు
👉 ప్రస్తుతం పనిచేస్తున్న ఛానల్ యాజమాన్యానికి అధికారికంగా సమాచారం
ఇవ్వనున్నట్టు కోబ్రా న్యూస్ స్పష్టం చేస్తోంది.
కాలం ఎప్పుడూ ఒకేలా ఉండదు…
ఒకప్పుడు చేసిన పనులే, ఒక రోజు నేరస్తుడిగా ప్రజల మీ ముందు నిలబడతాయి.
🔍 త్వరలో…
👉 మైలర్ దేవులపల్లి TNGO కాలనీ స్కాం పూర్తి డాక్యుమెంట్లు
👉 ఆడియో–వీడియో ఆధారాలు
👉 బాధితుల ప్రత్యక్ష వాంగ్మూలాలు
కోబ్రా న్యూస్‌లో Exclusive.



