spot_img
Saturday, July 19, 2025
spot_img

రాష్ట్రంలో అసలేం జరుగుతోంది?.. హెబియస్ కార్పస్ పిటిషన్‌లపై హైకోర్టు ఆశ్చర్యం

కూటమి ప్రభుత్వంలో పోలీసుల అక్రమ నిర్బంధాలపై వైఎస్సార్‌సీపీ సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌ల కుటుంబ సభ్యులు హైకోర్టును ఆశ్రయించారు.పదుల సంఖ్యలో హెబియస్ కార్పస్ పిటిషన్‌లను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లపై న్యాయస్థానం విచారణ చేపట్టింది.సోషల్‌ మీడియా యాక్టివిస్ట్‌లు జింకాల రామాంజనేయులు, తిరుపతి లోకేష్, మునగాల హరీశ్వరరెడ్డి, నక్కిన శ్యామ్, పెద్దిరెడ్డి సుధారాణి-వెంకటరెడ్డి దంపతులు, మహమ్మద్ ఖాజాభాషాలను పోలీసులు అక్రమంగా నిర్భందించారు. పోలీసుల నిర్భందంపై బాధితుల కుటుంబ సభ్యులు హైకోర్టు మెట్లెక్కారు. తమకు న్యాయం చేయాలని కోరుతూ ఆరు హెబియస్ కార్పస్ పిటిషన్లను దాఖలు చేశారు. ఆ పిటిషన్‌లపై హైకోర్టు ఇవాళ విచారణ చేపట్టింది. విచారణలో ఒకేసారి ఇన్ని హెబియస్ కార్పస్ పిటిషన్లు పడటంపై హైకోర్టు ఆశ్చర్యం వ్యక్తం చేసింది. హెబియస్ కార్పస్ పిటిషన్‌లపై మధ్యాహ్నం 2:15కి విచారణ చేపట్టనుంది హైకోర్టు

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular