spot_img
Monday, September 29, 2025
spot_img

రూమ్ షేరింగ్‌కు ఓఎల్‌ఎక్స్ ప్రకటన ఇచ్చిన యువకుడు.. షేరింగ్ వచ్చిన మహిళ వేశ్య అసలు కధ ఇక్కడే మొదలైంది

నగరానికి కొత్తగా వచ్చిన వాళ్లు ఎవరైనా పీజీ హాస్టల్స్‌లో ఉంటారు. లేకుంటే షేరింగ్ రూమ్స్‌ దొరికితే అందులో ఇద్దరు కలిసి ఉంటారు రెంటు తగ్గుతుంది తోడుగా ఇంకొకరు ఉంటారు అని షేరింగ్ లో ఉండేందుకు ఆసక్తి చూపిస్తారు

కొందరు ఇంటర్వూల కోసం రోజు వారీగా ఈ షేరింగ్ రూమ్ లలో ఉంటారు. మరికొందరు నెలల తరబడి ఉంటారు. అయితే ఈ షేరింగ్ రూమ్ వ్యవహారం లో మీరు ఊహించని ఆసక్తికరమైన పరిణామం క్రైమ్ జరిగింది . ఎస్ఆర్ నగర్ పరిధిలోని వెంగళరావు నగర్ మధురానగర్‌లో ఒక సాఫ్ట్ వేర్ ఉద్యోగి కిరణ్ కుమార్ రూం అద్దెకు తీసుకొని ఉంటున్నారు. ఏడాది కాలంగా ఇక్కడే నివసిస్తున్నారు.

తనతోపాటూ ఎవరైనా రూం షేర్ చేసుకుంటే బాగుంటుందనుకొని ఓఎల్ఎక్స్‌ వేదికపై ప్రకటన ఇచ్చారు. అందులో అతని కాంటాక్ట్ నంబర్ ఇవ్వడంతో ఒక మహిళ ఆసక్తిచూపి ఫోన్ చేసింది. ఆ రూమ్‌ను ఇచ్చేందుకు సిద్దమైయ్యాడు సాఫ్ట్‌వేర్ ఉద్యోగి. కొన్ని రోజుల తరువాత కూకట్‌పల్లికి వెళ్లిన కిరణ్ కుమార్‌తో ఆ మహిళ వేశ్య అని చెప్పడంతో అద్దెకు ఇచ్చిన గదిని ఖాళీ చేయమన్నారు. దీనికి ఆమె ఒప్పుకోలేదు. దీంతో ఇద్దరి మధ్య వాగ్వాదం జరిగి సన్నిహితంగా ఉన్న ఫోటోలను సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేస్తానంటూ బెదిరించింది. ఆపై షీ టీం ను ఆశ్రయించి తనపై లైంగిక దాడి చేశాడంటూ ఫిర్యాదు చేసింది. పోలీసులు ఇద్దరికీ కౌన్సిలింగ్ ఇచ్చి పంపించారు.

ఆ తరువాత కిరణ్ వద్ద నుంచి రూ. 4.7 లక్షలు పరిహారంగా తీసుకుంది. డబ్బులు తీసుకొని కూడా ఇద్దరూ చనువుగా ఉన్న ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. దీనిపై స్పందించిన కిరణ్ సైబర్ పోలీసులను ఆశ్రయించారు. కంప్లైంట్ తీసుకొని ఆ ఫోటోలను సామాజిక మాధ్యమ అకౌంట్ల నుంచి తొలగించారు. ఇంతటితో ఆగకుండా మరింత దారుణానికి ఒడిగట్టింది ఆ వేశ్య మహిళ. పోలీసులకు తనపై ఫిర్యాదు చేశాడని ఈ నెల 13న రాత్రి 9గంటల సమయంలో ఇద్దరు వ్యక్తులతో కిరణ్‌పై దాడి చేయించింది. తనపై జరిగిన దాటిని ఖండిస్తూ బుధవారం రాత్రి బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో ఆ మహిళపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular