సినీ ఇండస్ట్రీ అంటనే క్యాస్టింగ్ కౌచ్‌కు పెట్టింది పేరు. జూనియర్ ఆర్టిస్ట్ నుంచి టాప్ హీరోయిన్ వరకు ఏదో ఒక సందర్భంలో ఎవరో ఒకరి చేతిలో లైంగిక వేధింపులకు గురై ఉంటారు.ఈ విషయంలో శ్రీ రెడ్డి చేసిన హడావుడి హంగామా చెయ్యడం..ఆతరువాత కొందరు హీరోయిన్లు కూడా తాము ఈ క్యాష్టింగ్ కౌచ్ కు బలి అయ్యాము అని డైరెక్ట్ గా మీడియా ముందుకు వచ్చి స్టేట్మెంట్ ఇచ్చారు..వాళ్లకు కమిట్‌మెంట్ ఇచ్చి పక్కలోకి వెళ్తేనే సినిమా అవకాశాలు. లేకపోతే ఎంత టాలెంట్ ఉన్నా.. ఇంట్లో కూర్చోవాల్సిందే. తాజాగా ఓ జూనియర్ ఆర్టిస్ట్ కూడా ఇలాగే వేధింపులకు గురైంది. ఆమె ఫోన్ పేకు డబ్బులు పంపి రాత్రికి పక్కలోకి రావాలని ఆహ్వానించడం కలకలం సృష్టించింది. ఈ షాకింగ్ ఘటనపై ఆ జూనియర్ ఆర్టిస్ట్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
వెండి తెరమీద ఎలాగైనా తన టాలెంట్ ప్రూవ్ చేసుకోవాలని వచ్చి ఇబ్బంది పడింది or జూనియర్ అర్డిష్ట్ .సినిమాలపై మక్కువతో ఓ యువతి హైదరాబాద్ వచ్చి స్థిరపడింది. మధురానగర్‌లో ఉంటూ జూనియర్ ఆర్టిస్ట్‌గా నటిస్తోంది. అయితే ఆమెకు గుర్తు తెలియని నంబర్ల నుంచి డబ్బులు పంపించడం.. సినిమా అవకాశాలు ఇప్పిస్తానని తరచూ ఫోన్ కాల్స్ చేస్తున్నారు. అసలు ఎవరు నువ్వు అని సదరు జూనియర్ ఆర్టిస్ట్ ఫోన్‌లో నిలదీయగా.. తను సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తినేనని, షూటింగ్‌లకు జూనియర్ ఆర్టిస్టులను సప్లయ్ చేసే కాంట్రాక్టర్‌ను అని చెప్పాడు. నీకు సినిమాల్లో అవకాశం ఇప్పిస్తాను.. నాతో ఒక రాత్రి గడుపు అని వేధింపులకు గురి చేశాడు. అంతటితో ఆగకుండా ఫోన్ పేకు రూ.10 వేలు పంపించి ఈ రోజు రాత్రికి నా రూమ్‌కు రా.. నీకు సినిమాలో చాన్స్ ఇస్తా అంటూ అసభ్యకరంగా మాట్లాడాడు.
అతడు ఎవరో కూడా తెలియని ఆ జూనియర్ ఆర్టిస్ట్ నిత్యం వేధింపులకు గురైంది. ఇక భరించలేని ఆమె తాజాగా మధురానగర్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. సినిమా చాన్స్‌ల పేరిట లైంగిక వేధింపులకు గురి చేస్తున్నాడని, అడగకపోయినా డబ్బులు పంపించి రాత్రి రూమ్‌కు రావాలంటున్నాడని, మా ఊరుకు వెళ్లి నాపై అసభ్యకర ప్రచారం చేస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొన్నది. అతడిపై వెంటనే చర్యలు తీసుకోని తనను రక్షించాలని వేడుకుంది. కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడిని గుర్తించినట్లు తెలుస్తోంది..సదరు వ్యక్తి సినిమా లో పలుకుబడి ఉన్న వ్యక్తి అని సమాచారం