spot_img
Sunday, July 20, 2025
spot_img

రూ.80 కోట్లు కొట్టేశాడు, వాడి వల్లే వీధిన పడ్డాం.. పూరి జగన్నాధ్ తల్లి సంచలన వ్యాఖ్యలు

డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు పూరి ప్రియమైన దర్శకుడు. కేవలం మూడు నెలల్లోనే మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమా ఫినిష్ చేయగల సత్తా ఉన్న దర్శకుల్లో పూరి ఒకరు. డైరెక్టర్ పూరి జగన్నాధ్ ఎంతటి ట్యాలెంటెడ్ డైరెక్టర్ అనేది ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నిర్మాతలకు పూరి ప్రియమైన దర్శకుడు. కేవలం మూడు నెలల్లోనే మంచి క్వాలిటీ అవుట్ పుట్ తో సినిమా ఫినిష్ చేయగల సత్తా ఉన్న దర్శకుల్లో పూరి ఒకరు. కొంత కాలంగా పూరి జగన్నాధ్ ఫామ్ సరిగా లేదు. పూరి క్రేజ్ కి తగ్గట్లుగా హిట్ చిత్రాలు పడడం లేదు.


లైగర్ దారుణమైన ఫ్లాప్ తర్వాత పూరి ప్రస్తుతం రామ్ పోతినేని తో డబుల్ ఇస్మార్ట్ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. పూరి జగన్నాధ్ కెరీర్ లో చాలా ఒడిదుడుకులు ఉన్నాయి. పూరి స్టార్ డైరెక్టర్ అయ్యాక కూడా ఒక సందర్భంలో రోడ్డున పడే పరిస్థితి వచ్చింది. కోట్ల రూపాయలు మోసపోయానని పూరి కూడా తెలిపారు. విషయం గురించి తాజాగా పూరి జగన్నాధ్ తల్లి అమ్మాజీ ఓ ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. నా కొడుకు పడ్డ కష్టం ఎవరూ పడకూడదు. డిగ్రీ పూర్తయ్యాక హైదరాబాద్ వచ్చి సినిమా ఆఫీస్ ల చుట్టూ కాళ్లరిగేలా తిరిగాడు. ఏడో తరగతి నుంచే వాడికి సినిమాలంటే పిచ్చి. ఒకరోజు నేను హైదరాబాద్ కి వెళ్ళా. అప్పటికి పూరికి ఇంకా ఛాన్స్ రాలేదు.కాళ్ళు చూస్తే బాగా వాచిపోయి ఉన్నాయి. సాక్సులు వేసుకోవడానికి కూడా కాలేదు. అది చూసి ఏడ్చేశా. ఇంత కష్టం ఎందుకు.. ఊరికి వచ్చేయ్ పొలం పని చేసుకుందాం అని చెప్పా. కానీ రానని చెప్పాడు. అన్నం తినకుండా మంచి నీళ్లు తాగిన సందర్భాలు ఉన్నాయి.

డైరెక్టర్ అయ్యాక పూరి దగ్గర పనిచేసే కుర్రాడు ఒకడు రూ. 80 కోట్లు కొట్టేసి మోసం చేశాడు. ఒక సినిమా వల్ల కూడా నష్టం వచ్చింది. దీనితో ఒక్కసారిగా కుటుంబంపై పిడిగు పడ్డట్లు అయింది. దీనితో దాదాపు 5 ఇల్లు అమ్మేశాడు. దాదాపుగా వీడిన పడే పరిస్థితి. మోసం చేసిన వాడి కాళ్ళు చేతులు విరిచేద్దామా అని పూరి స్నేహితుడు ఒకరు సలహా ఇవ్వగా.. వద్దని చెప్పాడు.వాడికి ఏ జన్మలోనో రుణపడి ఉన్నాం అందుకే ఇలా జరిగింది అని సైలెంట్ అయిపోయాడు. ఒంట్లో సత్తువ ఉన్ననంత వరకు కష్టపడతా అని ఆ విషయాన్ని అంతటితో వదిలేశాడు. నా కొడుకు హృదయం అలాంటిది అని అమ్మాజీ అన్నారు. సొంత ఊరిలో పూరి గుడి కట్టించారు. సాయం అని అడిగిన వారికి లక్షల్లో సహాయం చేశాడు అంటూ తన కొడుకు గురించి అమ్మాజీ తెలిపారు.

RELATED ARTICLES

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

- Advertisment -spot_img

Most Popular